రోడ్డుపై చెత్త పడితే... ఫైనే
హైద్రాబాద్, జూన్ 12,
మహానగరాన్ని విశ్వనగరంలో మార్చేందుకు బల్దియా అధికారులు నూతన విధానాలు తీసుకొస్తూ నగర శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేత స్వచ్చతపై పలు అవార్డులు సొంతం చేసుకుని మెట్రో నగరాల్లో ముందు వరుసలో నిలిచింది. హైదరాబాద్ నగరంలో రోడ్లపై చెత్త కనిపించకుండా ఉండేందుకు ఎప్పటికప్పడు గార్బేజ్‌లోకి పడేసేందుకు చెత్త ఆటోలతో తరలిస్తున్నారు. అయిన కొన్ని చోట్ల ప్రధాన రహదారులపై చెత్త కుప్పలు ఉండటం, వాటికి తోడు భవన నిర్మాణాల వ్యర్దాలు గుట్టలుగుట్టలు పోయడం, డ్రైనేజిలో ప్లాస్లిక్ వ్యర్దాలు వేసి నగర శుభ్రతకు అటంకం కల్గిస్తున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులు నిబంధనలు దిక్కరించేవారిపై జరిమానా వేస్తామని రెండు నెల కితం ప్రకటించింది.స్దానిక ప్రజలు కొంతమంది పట్టించుకోకుండా ఎక్కడపడితే అక్కడ వ్యర్దాలు వేయడంతో మే 24 నుంచి వ్యర్దాలు వేసే వారిపై నిఘా పెట్టి వారం రోజుల వ్యవధిలో 6 జోనల్ పరిధిలో అధికారులు 332మంది గుర్తించి వారికి రూ. 4,34,600 జరిమానా విధించింది. నగర ప్రజల్లో మార్పు తేవడానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు స్వచ్చంద సంస్దలు, మత పెద్దలతో కూడా ప్రచారం కార్యక్రమం చేపట్టారు. అయిన ప్రజల్లో స్పందన లేకపోవడంపై స్దానిక జీహెచ్‌ఎంసీ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగర పరిశుభ్రత విషయంలో అధికారులు ఒకరే పూర్తిగా చేయలేరని, ప్రజల సహకరం ఉంటే అనుకున్న లక్షానికి చేరుకుంటామని వివరిస్తున్నారు.బల్దియా ఎంతో ఆర్బాటంగా ప్రవేశపెట్టిన చెత్త ఆటోలు బస్తీ, కాలనీలోకి మూడు రోజులకోసారి వస్తూ హడావుడిగా చెత్తను వేసుకుని బయపడుతున్నారని కొత్తపేట హుడా కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు చెత్త ఆటో నిర్వహకులు వచ్చి నెలవారీగా ఇవ్వాల్సిన నగదు వసూలు చేసుకుని కనిపించకుండా పోతున్నారని పేర్కొంటున్నారు. ఇళ్లలో ఎవరు లేని సమయంలో ఉదయం 10గంటలకు వస్తూ అందుబాటులో ఉన్నచోట వేసుకుని మిగతా చోట్ల వదిలేసిపోతున్నారని, ఉదయం 6గంటలకు వస్తే ఇళ్లలో ప్రతిఒకరు చెత్త వేసి శుభ్రత పాటిస్తారని చెబుతున్నారు. చెత్త ఆటోల నిర్లక్షం కారణంగా రోడ్లపై చెత్తను వేయాల్సి వస్తుందని వెల్లడిస్తున్నారు. స్దానిక మున్సిఫల్ అధికారులు చెత్త వాహనాలపై నిఘాపెట్టి సమయం పాటిస్తున్నారో గమనించి పనిచేయని ఆటోలను తొలగించాలని సూచిస్తున్నారు. చెత్త ఆటోల నిర్వహణ సక్రమం లేకుండా రోడ్లపై వేస్తే జరిమానాలు వేస్తామడం సరికాదని హెచ్చరిస్తున్నారు.