YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ

కళకళలాడుతున్న షూటింగ్ స్పాట్లు

కళకళలాడుతున్న షూటింగ్ స్పాట్లు

కళకళలాడుతున్న షూటింగ్ స్పాట్లు
హైద్రాబాద్, జూన్ 12
కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలల తర్వాత తెలంగాణలో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. రీసెంట్ గా సినిమా, టీవీ షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మళ్లీ షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. టీవీ, సినీ ఇండస్ట్రీలో సందడి నెలకొంది. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన నటీనటులు మళ్లీ మేకప్ వేసుకున్నారు. మధ్యలో ఆగిపోయిన షూటింగ్ లు మళ్లీ మొదలయ్యాయి. లాక్ డౌన్ సడలింపులతో 80 రోజుల తర్వాత మళ్లీ సారథి స్టూడియోలో షూటింగ్స్ సందడి కనిపిస్తోంది. సారథి స్టూడియోలో నెంబర్ వన్ కోడలు టీవీ సీరియల్ షూటింగ్ ను యాజమాన్యం స్టార్ట్ చేసింది సీరియల్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఓ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ లో ఈ సీరియల్ రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ సీరియల్ డైరెక్టర్ శ్రీనివాస్. హరీష్ చిగురుపాటి నిర్మాత. హీరో జై ధనుస్సు, హీరోయిన్-మధుమిత(బెంగళూరు).ప్రభుత్వ ఆదేశాలు మేరకు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ నిర్వహిస్తున్నారు. లొకేషన్ లో సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లౌస్ ధరించారు. థర్మల్ స్రీనింగ్ కూడా ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా డాక్టర్ ని కూడా పెట్టుకున్నారు యూనిట్ సభ్యులు. చాలా రోజుల తర్వాత షూటింగ్ లో పాల్గొనడటం ఆనందంగా ఉందని ఆరిస్టులు చెప్పారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ లో పాల్గొంటున్నామని తెలిపారు. షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చినందుకు కేసీఆర్ ప్రభుత్వానికి ఆర్టిస్టులు థ్యాంక్స్ చెప్పారు. ప్రభుత్వం చెప్పినట్టుగా నిర్మాత అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, ఆర్టిస్టులకు అన్నీ ప్రొవైడ్ చేశారని తెలిపారు. ముఖ్యంగా మేకప్ మ్యాన్స్ కి, హెయిర్ డ్రెసర్స్ కి కంప్లీట్ కిట్లు ఇచ్చారు.షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ సమయంలో పాటించాల్సిన విధివిధానాలు, నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను  విడుదల చేసింది.
సినిమా, టీవీ షూటింగ్‌‌లకు మార్గదర్శకాలు:
* షూటింగ్ లొకేషన్లు, సెట్లలో చిత్రీకరణలో పాల్గొనే వ్యక్తులు ప్రతి ఒక్కరూ మాస్క్ కచ్చితంగా ధరించాలి. 
* భౌతిక దూరం పాటించాలి. 
* ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌజులను అందుబాటులో ఉంచాలి. 
* గరిష్ఠంగా 40 మంది సిబ్బందితో మాత్రమే షూటింగ్ ప్రక్రియలో పాల్గొనాలి. 
* చిత్రీకరణ జరిగే ప్రాంతాల్లో సిగరెట్లు, బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తులు, పాన్‌ నమలడం నిషిద్ధం.
* మెడికల్ క్లియరెన్స్ లేనిదే 10 నుంచి 60 ఏళ్ల లోపు వారికి షూటింగ్‌లకు అనుమతి లేదు. 
* షూటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్క వ్యక్తి నుంచి మెడికల్ డిక్లరేషన్ తీసుకోవాలి. 
* చిత్రీకరణకు ముందు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని చెక్ చేయించుకోవాలి.
* స్టూడియోల్లోకి సందర్శకులకు అనుమతి ఇవ్వకూడదు. 
* సాధ్యమైనంత మేరకు ఇండోర్‌‌లోనే షూటింగ్‌లు జరుపుకొనేలా ప్రణాళిక వేసుకోవాలి. 
* ఇక కంటైన్మెంట్ జోన్లలో సినిమా షూటింగ్‌లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు.
* నటీనటులు, సిబ్బంది తమ ఆహారాన్ని, తాగు నీటిని ఇంటి నుంచే తెచ్చుకోవాలి. 
* నటీనటుల వ్యక్తిగత మేకప్ కిట్లు ఒకరివి మరొకరు వాడకుండా చూసుకోవాలి.
* షూటింగ్ స్పాట్ లో డాక్టర్ కంపల్సరీగా ఉండాలి. 
* మొదటి దశలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి.
* లాక్ డౌన్ కారణంగా ఆగిన సినిమా, సీరియల్ షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్. 
* ఆర్టిస్టుల ఆరోగ్య భద్రత నిర్మాతలదే.

Related Posts