YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అక్రమాల నేపధ్యంలోనే ఆరెస్టు

అక్రమాల నేపధ్యంలోనే ఆరెస్టు

 అక్రమాల నేపధ్యంలోనే ఆరెస్టు
విజయవాడ జూన్ 12
మాజీ మంత్రి , టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన విషయంపై ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. మందుల కొనుగోళ్లలో ఆయన అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేశారని తెలిపారు. వైద్య పరికరాల కొనుగోళ్లలోనూ అవినీతి జరిగిందని ఆమె చెప్పారు.అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. జగన్ని అరెస్ట్ చేసినప్పుడు సంబరాలు చేసుకున్నవారు ఇప్పుడెలా మాట్లాడతారని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పినట్లుగా అచ్చెన్నాయుడిని లాక్కుని వెళ్లలేదని, మామూలుగానే తీసుకెళ్లారని తెలిపారు. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేశారు. వైద్య పరికరాల కొనుగోళ్లలనూ అవినీతి జరిగిందన్నారు.

Related Posts