YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

స్కాంలో పాత్ర నిర్ధారణ అయ్యాకే అచ్చెన్నాయుడి అరెస్ట్  ఏసీబీ డైరెక్టర్ రవికుమార్

స్కాంలో పాత్ర నిర్ధారణ అయ్యాకే అచ్చెన్నాయుడి అరెస్ట్   ఏసీబీ డైరెక్టర్ రవికుమార్

స్కాంలో పాత్ర నిర్ధారణ అయ్యాకే అచ్చెన్నాయుడి అరెస్ట్ 
              ఏసీబీ డైరెక్టర్ రవికుమార్
అమరావతి జూన్ 12
టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు వివరాలు వెల్లడించారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఏసీబీ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు స్కాం వివరాలను ఆయన వెల్లడించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ అనంతరం ఏసీబీ డైరెక్టర్ రవికుమార్ స్కాం వివరాలను వెల్లడించారు. ఈఎస్ఐ స్కాం లో విజిలెన్స్ నివేదిక వచ్చిందని.. దాని ప్రకారమే తాము దర్యాప్తు చేశామని చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో నకిలీ బిల్లులు సృష్టించి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు నాటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్పడ్డారని ఏసీబీ డైరెక్టర్ తెలిపారు. ఏసీబీ దర్యాప్తులో అక్రమాలు నిర్ధారణ అయ్యాక నిందితులను అరెస్ట్ చేశామని ఆయన వివరించారు.విజిలెన్స్ విచారణలో మొత్తం 988.77 కోట్ల విలువైన మందులు వైద్య పరికరాల కొనుగోలులో సుమారు రూ.150 కోట్లపైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా  నిర్ధారణ అయ్యిందని ఏసీబీ డైరెక్టర్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధం గా టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతి లో కట్టబెట్టారని తెలిపారు. విజిలెన్స్ దర్యాప్తులో అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడినట్లు తేలిన తరువాతే ఏసీబీ విచారణ జరిపినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అచ్చెన్నాయుడితోపాటు తిరుపతికి చెందిన ఈఎస్ఐ డైరెక్టర్ సీకే రమేశ్ కుమార్ రాజమండ్రి కి చెందిన విజయ్ కుమార్ ఉన్నారని ఏసీబీ డైరెక్టర్ వెల్లడించారు. 

Related Posts