కరోనా జాగ్రత్తలతో కేస్ 30 సినిమా షూటింగ్
ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని లాక్ డౌన్ రావడంతో మూవీని పోప్ట్ పోన్ చేసుకున్నాం. ప్రభుత్వ అనుమతులు రావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని మళ్లీ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. ఎనిమిది నుంచి పది మంది మాత్రమే సెట్ లో వుండేటట్లు ప్లాన్ చేసుకున్నాం. ఇన్ డోర్ షూటింగ్ చేయబోతున్నాం. మెకప్, హెయిర్ డ్రెస్సర్లకు పీపీఈ కిట్లు ఇస్తున్నాం. మిగతా టీం సభ్యులకు ఫేస్ మాస్క్ లు, షీల్డ్ ఇస్తున్నాం. అందరి ఆరోగ్యస్థితిని దృష్టిలో వుంచుకున్నాం. కొంతమందిని బయటకు వెళ్లకుండా షెడ్యూల్ పూర్తయ్యేవరకు వుండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి రోజు అందరి టెంపరేచర్ చెక్ చేస్తామని కేస్ 30 డైరెక్టర్ సందీప్ తెలిపారు.