YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అచ్చెన్నాయుడు  అరెస్ట్ వైసీపీ ప్రభుత్వ అహంకార తీరుకు పరాకాష్ట  టిడిపి నేత బీద రవిచంద్ర 

అచ్చెన్నాయుడు  అరెస్ట్ వైసీపీ ప్రభుత్వ అహంకార తీరుకు పరాకాష్ట  టిడిపి నేత బీద రవిచంద్ర 

అచ్చెన్నాయుడు  అరెస్ట్ వైసీపీ ప్రభుత్వ అహంకార తీరుకు పరాకాష్ట
 టిడిపి నేత బీద రవిచంద్ర 
నెల్లూరు జూన్ 12
అచ్చెన్నాయుడు  అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా బీసీ నేతలపై జరిగిన కుట్ర మాత్రమేనని నెల్లూరు జిల్లా టిడిపి అధ్యక్షులు బీద రవిచంద్ర పేర్కొన్నారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనలో ఘోరంగా వైఫల్యం చెందింది.ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం, కోర్టుల నుంచి చివాట్లు తింటున్న నేపథ్యంలో అందరి దృష్టి మళ్లించేందుకే ఈ డైవర్షన్ రాజకీయ కుట్రకు తెరలేపారు.టిడిఎల్పి డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడు  అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తారన్న భయంతో నే అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు..ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి చేసిన తప్పులను సరిదిద్దుకో పోతే ప్రజల చేతిలో భంగపాటు తప్పదు.బడుగు, బలహీన వర్గాలకు రక్షణగా అంబేద్కర్  రాజ్యాంగం  ఉందనే విషయాన్ని జగన్ గుర్తు ఎరిగితే మంచిదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు .అచ్చెన్నాయుడు ని ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయడం దారుణం అన్నారు. రాష్ట్రంలో బీసీలను అణగదొక్కాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రభుత్వ చర్యలను విమర్శించారు. ప్రభుత్వంపై పోరాటాలు చేస్తే అరెస్టులే అన్నట్లు గా ప్రభుత్వ తీరు ఉంది ,వేధింపులు  గడచిన ఏడాది పాలనలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సరికాదని, 70 సార్లు కోర్టులు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.టిడిపి నాయకుల కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైకాపా నాయకులు కార్యకర్తలు చేస్తున్న అనాగరిక చర్య లు మానుకోవాలని హెచ్చరించారు.

Related Posts