YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

14 చోరీకేసులను చేధించిన డోన్ పోలీసులు 

14 చోరీకేసులను చేధించిన డోన్ పోలీసులు 

14 చోరీకేసులను చేధించిన డోన్ పోలీసులు 
డోన్  జూన్12
డోన్ పట్టణ పోలీసులకు 14 చోరీ కేసులను  చేధించిన ఘనత ఈరోజు దక్కింది. ఈ విజయం డోన్ పట్టణ చోరీ కేసులలో ఛేదించిన వాటి కంటే అతి పెద్ద విజయమని డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు. 2018 జూలై 6వ తారీకు రాత్రి డోన్ గాంధీ విగ్రహం సర్కిల్ దగ్గర ఉన్న శివా జూలర్స్ లో బంగారం వెండి దొంగతనం జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ కేసుతో  సహా లాక్ డౌన్ సమయంలో ఏప్రిల్ 20వ తారీకు ముక్తేశ్వర్ ఆలయం దగ్గర వున్న వీణా ఎలక్ట్రానిక్స్ షాప్ లో జరిగిన టీవీల చోరీ వరకు రికవరీ చేసి బిగ్ బ్రేక్ ఇచ్చారు. ముద్దాయిలు తలారి శివన్న కుమారుడు తలారి నాగ విజయుడు 32 సం,,లు కొత్తపేట డోన్ , బజారి కుమారుడు బండారి సంతోష్ కుమార్ 27 సం,,లు రంగాపురం గ్రామం, దాసరి మధు కుమారుడు దాసరి ఈశ్వరయ్య 20 సం,,లు కొత్తపేట డోన్. ఈ ముగ్గురు నిందితులు చెడు వ్యసనాలకు లోనై పని చేసే గుణం కాకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వేరే ఏ మార్గమైనా కాస్త పెట్టుబడి అవసరం కాబట్టి దొంగతనాలు అయితే తెలివే పెట్టుబడి కాబట్టి వీరు ఈ తప్పుడు మార్గాన్ని ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్నారు. చాలామంది దొంగతనాలు చేయాలంటే వారి సొంత ఊర్లో కాక వేరే ఊర్లో చేస్తే దొరకరనే ఉద్దేశంతో చేస్తుంటారు. అయితే లాక్ డౌన్ సమయంలో వాహనాలు ఏవీ తిరగడం లేదు వీణా ఎలక్ట్రానిక్స్ షాప్లో దొంగతనం జరిగింది అని ఫిర్యాదు ఇచ్చిన తర్వాత డాగ్స్ స్కాడ్, క్లూస్ టీంతో పరిశోధనలు ప్రారంభించి 21/04  ఉదయం 12 గంటలకు సంఘటన స్థలాన్ని మొత్తం తనిఖీ చేసి అక్కడ లభించిన కీలకమైన ఆధారాల ద్వారా ముద్దాయిల యొక్క వివరాలు తెలుసుకోవడం జరిగిందని. అయితే ఇన్వెస్టిగేషన్లో భాగంగా నేరస్తులను పట్టుకోవడానికి ఎస్సై సురేష్, నరేష్ వారు సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల ఆచూకీ కోసం పలు చోట్ల వెతికి కొంతమంది సమాచారం ఇచ్చే వారిని నియమించడం జరిగంది. అయితే 11/06 గురువారం వాహనాలపై టీవీలను తీసుకు వెళ్తున్నారు అని రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు డోన్ పట్టణ సీఐ టి. సుబ్రమణ్యం, ఎస్ ఐ ఆర్. సురేష్, ఎం.నరేష్, సిబ్బంది బి సి హాస్టల్ కొండపేట దగ్గర వాహనాల తనిఖీలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర్నుంచి 40 తులాల బంగారు(4 నక్లీస్లు, 6 చైన్లు, 6 గాజులు, ఉంగరాలు, 15 జతల చెవి కమ్మలు) 24 కేజీల వెండి(2 నడుము వడ్డాణాలు, మిగతావన్నీ కాళ్ల పట్టీలు),12 ఎల్ఈడి టీవీలు, సౌండ్ స్పీకర్లు, రెండు ద్విచక్ర వాహనాలు(హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఏపీ 21 ఏ జెడ్ 6914, హోండా యూనికాన్ ఏపీ 21 ఎ ఆర్ 2802), 40 వేల విలువగల బట్టలు, ల్యాబ్ టెస్ట్ కు యూస్ చేసే 1 సెల్ కౌంటర్, సెంటర్ ఫ్యూజ్, అనలైజర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసును ఎంతో చాకచక్యంగా, శ్రమతో ఛేదించి నిందితులను పట్టున్నందుకు సి ఐ సుబ్రమణ్యం, ఎస్సై నరేష్, సురేష్ వారి సిబ్బందిని డి.ఎస్.పి నరసింహా రెడ్డి అభినందించారు.
 

Related Posts