కేంద్ర విదేశాంగ మంత్రికి లేఖ రాసిన వినోద్ కుమార్
హైదరాబాద్ జూన్12
దోహ, ఖతార్ తెలంగాణ సంఘాల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ కు శుక్రవారం లేఖ రాశారు. దోహ, ఖతార్ నుంచి హైదరాబాద్ కు విమానాల సంఖ్యను పెంచాలని, గల్ఫ్ లోని తెలంగాణ వారిని తక్షణమే తిరిగి సొంత గ్రామాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ కేంద్ర విదేశాంగ మంత్రి కి రాసిన లేఖలో కోరారు.