YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కిదాంబి శ్రీ కాంత్ నెంబర్ వన్....!!

కిదాంబి  శ్రీ కాంత్ నెంబర్ వన్....!!

కిదాంబి శ్రీకాంత్‌ చరిత్ర సృష్టించనున్నాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించనున్న ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ వరల్డ్ నంబర్ 1గా నిలవనున్నాడు. ఈ ఘనత సాధించనున్న తొలి భారత పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ కిదాంబి కావడం విశేషం. గతేడాది గాయం కారణంగా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం కోల్పోయిన కిదాంబి కామన్వెల్త్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీం విభాగంలో భారత్‌కు స్వర్ణం అందించడం ద్వారా నంబర్‌వన్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకోనున్నాడు. సోమవారం కామన్వెల్త్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీం విభాగంలో మలేషియాను 3-1తేడాతో భారత బ్యాడ్మింటన్‌ జట్టు చిత్తు చేసి స్వర్ణం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు సార్లు ఒలింపిక్‌ రజత పతక విజేత లీ చాంగ్‌ వీకి షాకిచ్చిన కిదాంబి శ్రీకాంత్‌ ఈ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజా విజయంతో శ్రీకాంత్‌ దాదాపు నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్నట్లే. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనుంది. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 76,895 పాయింట్లతో ముందంజలో ఉన్నాడు. పురుషుల విభాగంలో తొలిసారిగా నంబర్‌వన్‌ ర్యాంకును కైవసం చేసుకున్న తొలి భారతీయుడిగా శ్రీకాంత్‌ నిలువనున్నాడు. గతంలో భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ మహిళల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకు కైవసం చేసుకుంది. కంప్యూటరైజ్డ్ ర్యాంకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టక ముందు ప్రకాశ్ పదుకొనేను వరల్డ్ నంబర్ 1గా పరిగణించారు. 1980ల్లో ఆయన మూడు టాప్ టోర్నీలను తన ఖాతాలో వేసుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ టీం విభాగంలో భారత్ స్వర్ణం గెలవడంలో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించాడు. మూడుసార్లు ఒలింపిక్స్‌లో రజతం సాధించిన లీ చోంగ్ వెయిపై కామన్వెల్త్ పోరులో శ్రీకాంత్ 21-17, 21-14 తేడాతో గెలుపొందాడు.వీరిద్దరూ ఐదుసార్లు తలపడగా.. శ్రీకాంత్‌‌కి ఇది తొలి గెలుపు కావడం విశేషం.ఏడాది కాలంలో నిర్వహించిన 10 అత్యుత్తమ టోర్నీల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. ప్రస్తుతం నంబర్ 1గా ఉన్న అక్సెల్‌సెన్ 1660 పాయింట్లు కోల్పోనుండటం శ్రీకాంత్‌కు కలిసి రానుంది. గత ఏడాది ఇండోనేసియా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్రాన్స్ సూపర్ సిరీస్‌లను శ్రీకాంత్ తన ఖాతాలో వేసుకొని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. గత నవంబర్లో రెండో స్థానానికి ఎగబాకాడు.

Related Posts