YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కూట్లో రాయి తీయలేనోడు, ఏట్లో రాయి తీయడానికి పోయిండట     

కూట్లో రాయి తీయలేనోడు, ఏట్లో రాయి తీయడానికి పోయిండట     

కూట్లో రాయి తీయలేనోడు, ఏట్లో రాయి తీయడానికి పోయిండట     
         ఎటిన్జిఓ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డిపై తిరువరంగం ఫైర్ 
 హైదరాబాద్ జూన్ 12 (న్యూస్ పల్స్) 
గత 3 నెలలుగా తెలంగాణ ఉద్యోగ , ఉపాధ్యాయులకు 50 % వేతనం మరియు పెన్షనర్లకు 75% పెన్షన్ కు ఇస్తున్న దివాళా కోరు ప్రభుత్వ విధానాన్ని నిలదీయడం వదిలేసి, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు జారీ చేసిన డిఏ నిలుపుదల ఉత్తర్వులను, వెంటనే ఉపసంహరించుకోవాలని, ఎటిన్జిఓ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్ధేశించి చేసిన డిమాండ్ దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని బిజెపి రిటైర్డ్ ఉద్యోగుల సెల్ రాష్ట్ర కో - ఛైర్మన్ తిరువరంగం ప్రభాకర్ విమర్శించారు.గత రెండేండ్లుగా పిఆర్సి ని మంజూరి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్న ఉద్దేశ్వపూర్వక నిర్లక్ష్యధోరణిని ప్రశ్నించకుండా, స్వార్థ ప్రయోజనాలకొరకు గాలికొదిలేసి తగుదునమ్మా అని కేంద్ర ప్రభుత్వాన్ని డిఏ గూర్చి ప్రశ్నించడం అంటే,  కూట్లో రాయి తీయలేనోడు, ఏట్లో రాయి తీయడానికి పోయిన చందం లా ఉందని,రాష్ట్ర ఉద్యోగ , ఉపాధ్యాయ, పెన్షనర్లందరిని తప్పు దోవ పట్టించడంగా తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు..టిజిఓ ,ఎటిన్జిఓ నేతలు, వాళ్ళ అస్మదీయులు రిటైర్మెంట్ అయితే, కేవలం వారికి మాత్రమే నిస్సిగ్గుగా, ఎక్స్ టెన్షన్ ఇప్పించుకోవడం సామాన్య ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలేసి, కోట్లాది రూపాయలు విలువచేసే అక్రమంగా పొందిన గచ్చిబౌళీ ఇండ్ల ప్లాట్లను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు సంఘాలను తాకట్టు పెట్టిన వీరికి, కేంద్ర ప్రభుత్వాన్ని డిఏ ఇవ్వాలని కోరే నైతిక హక్కు ఏ మాత్రం లేదని స్పష్టం చేసారు.కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా డిఏ నిలుపుదల చేసినా కూడా, దాదాపుగా 20 లక్షల కోట్ల సామాన్య జానానికి ప్యాకేజీగా ప్రకటించిందని, మరి రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు ఏం చేసిందో ప్రశ్నించడం మానేసి, కేంద్రాన్నిదుయ్యబట్టినట్లుగా వ్యవహరించి, రాష్ట్ర ప్రభుత్వం వద్ద మరిన్ని స్వార్థ ప్రయోజనాలు పొందేందుకు ఈ టిజిఓ ఎటిన్జిఓ నేతలు తమ ప్రతిభా పాటావాలను ప్రదర్శించడం నీతిమాలిన చర్యగా ప్రభాకర్ అభివర్ణించారు.
 

Related Posts