YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఇసుక విధానంలో ప్రభుత్వం విఫలం

ఇసుక విధానంలో ప్రభుత్వం విఫలం

ఇసుక విధానంలో ప్రభుత్వం విఫలం
ఒంగోలు జూన్ 12 
రాష్ట్ర్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడచినా మెరుగైన ఇసుక విధానం తీసుకురావడంలో విఫలమైందని భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాష్ట్ర్రంలో నెలకొన్న ఇసుక కొరత, ఇసుక అక్రమ రవాణా వంటి అంశాలపై బీజేపీ చేపట్టిన రాష్ట్ర్రవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఒంగోలులోని ఇసుక డంపింగ్ యార్డు వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే ఇసుక అక్రమాలను అరికడతామని, మెరుగైన పంపిణీ విధానాన్ని తీసుకువస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని అయితే, ఈ విషయంలో విఫలమైందన్నారు. ఇసుకపై ఆధారపడి రాష్ట్ర్రంలో దాదాపు 40లక్షల కుటుంబాలు బతుకుతున్నాయని, ఇసుక దొరకక గత ఏడాది కాలంలో దాదాపు 60మంది నిర్మాణ రంగ కార్మకులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర్రంలో గతంలో 10వేల రూపాయలకు లారీ ఇసుక లభించేదని ప్రస్తుతం దాదాపు 50వేల రూపాయలు పెట్టినా దొరకని పరిస్దితి ఉందని, ఈ విషయాన్ని అధికార పక్ష ఎమ్మెల్యేలే బహిరంగంగా చెబుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎస్,శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Related Posts