అవినీతి ఆరోపణలతోనే అచ్చెన్నాయుడు అరెస్ట్
అచ్చెన్నాయుడు ఏమైనా గాంధీనా? పూలేనా?
అవినీతిపరుడ్ని అరెస్ట్ చేస్తే కులం కార్డు అంటగడతారా?
చట్టం తన పని తాను చేసుకుపోతుంది అచ్చెన్నాయుడు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు టీడీపీ హయాంలో అవినీతికి పాల్పడ్డారు అన్నదానికి అచ్చెన్నాయుడే నిదర్శనం అవినీతికి సాక్ష్యాధారాలు ఉన్నందునే చట్టపరమైన చర్యలు
విజయవాడ జూన్ 12
మాజీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ హయాంలో మందుల కొనుగోళ్లలో దాదాపు రూ.150 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలపై అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే బీసీలపై దాడిగా టీడీపీ ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు, ఎమ్మెల్యేలు అన్నారు. పైగా కుల రాజకీయాలు చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని ప్రభుత్వం బయటపెడితే టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. అవినీతి చేసిన అచ్చెన్నాయుడు అరెస్ట్కు, బీసీలకు ఏం సంబంధమని వైయస్ఆర్సీపీ నేతలు చంద్రబాబును, టీడీపీ నేతలను ప్రశ్నించారు. పదిమంది కార్మికులకు మెరుగైన వైద్య సేవలందాల్సిన ఈఎస్ఐలో తవ్వేకొద్ది గుట్టలు గుట్టలుగా అవినీతి పుట్టలు బయట పడుతున్నాయని అన్నారు. అచ్చెన్నాయుడు తీసుకున్న నిర్ణయాలు..అడ్డదారిలో ప్రయాణం చేసిన విధివిధానాలపై ఎసిబి పలు కోణాల్లో అవినీతిపై దర్యాప్తు చేసిందని ఆధారాలు లభించిన ఆతర్వాతే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయటం జరిగిందనని హోంమంత్రి సుచరిత తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బీసీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియాతో మాట్లాడారు.