YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

18 నుంచి 9 శాతానికి తగ్గిన జీఎస్టీ 

18 నుంచి 9 శాతానికి తగ్గిన జీఎస్టీ 

18 నుంచి 9 శాతానికి తగ్గిన జీఎస్టీ 
హైదరాబాద్‌ జూన్ 12 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా.. ఇవాళ జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి సీతారామన్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్‌ 30 వరకు జీఎస్టీ రిటర్న్స్‌ దాఖలుకు రుసుము వసూల్‌ చేయకూడదని నిర్ణయించారు. 5 కోట్ల టర్నోవర్‌ ఉన్న వ్యాపారులకు ఊరట కల్పించారు.  జీఎస్టీ శాతాన్ని 18 నుంచి 9 శాతానికి తగ్గించారు. చిన్న వ్యాపారుల కోసం కీలక సంస్కరణలను తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.  జూలైలో మరోసారి జీఎస్టీ మండలి భేటీ జరగనున్నది. అప్పుడు నష్టపరిహారం పన్ను గురించి చర్చించనున్నారు. ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి అన్న అంశాన్ని చర్చించనున్నారు. 
 

Related Posts