YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అచ్చెన్నాయుడి కుటుంబానికి అండగా ఉంటా: చంద్రబాబు

అచ్చెన్నాయుడి కుటుంబానికి అండగా ఉంటా: చంద్రబాబు

అచ్చెన్నాయుడి కుటుంబానికి అండగా ఉంటా: చంద్రబాబు
అమరావతి జూన్ 12 
టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. ఈ మేరకు స్వయంగా అచ్చెన్న కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే టీడీఎల్పీ ఉపనేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని చంద్రబాబు అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని తెలిపారు.అచ్చెన్న అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో చంద్రబాబు లోకేష్ ఫోన్ లో మాట్లాడారు. సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా తీసుకెల్లారని చంద్రబాబుకు అచ్చెన్న కుటుంబ సభ్యులు తెలిపారు. తమతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని వివరించారు.ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ ఎల్లప్పుడూ అచ్చెన్న కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

Related Posts