YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సమ్మర్ క్లాసులు పెడితే... చర్యలే 12 కాలేజీలకు షోకాజ్...!!

సమ్మర్ క్లాసులు పెడితే... చర్యలే 12 కాలేజీలకు షోకాజ్...!!

వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే జూనియర్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. మార్చి29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇచ్చామని.. ఆ సమయంలో ఏ జూనియర్ కాలేజీ కూడా క్లాసులు నిర్వహించకూడదని ఆర్డర్స్ ఇచ్చింది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్ధులు తప్ప.. మిగతా స్టూడెంట్స్ సెలవు రోజుల్లో తరగతి గదుల్లో ఉండకూడదని ఆదేశించారు. అంతేకాకుండా హాస్టల్ రన్ చేయడానికి, కాలేజీ గుర్తింపు కోసం డాక్యుమెంటరీలను సమర్పించాల్సి ఉంటుందని అన్ని కాలేజీలను ఆదేశించారు.సెలవుల్లో క్లాసులు నిర్వహించినందుకు ఇప్పటికే నారాయణ, శ్రీచైతన్యతోపాటు 12 ప్రైవేట్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది ఇంటర్ బోర్డ్. ఇందులో 8 కాలేజీలను షట్ డౌన్ చేసినట్లు మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తెలిపారు. ఈ సంవత్సరం మొదట్లో రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్ కి TSBIE సూచనలు, గైడ్ లైన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే.

Related Posts