YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉత్తరాంధ్ర పట్టుకోసమే వ్యూహామా

ఉత్తరాంధ్ర పట్టుకోసమే వ్యూహామా

ఉత్తరాంధ్ర పట్టుకోసమే వ్యూహామా
శ్రీకాకుళం, జూన్ 13,
ఉత్తరాంధ్రా జిల్లాలు టీడీపీకి పెట్టని కోటలు, నాలుగు దశాబ్దాలుగా టీడీపీని మోస్తున్న జిల్లాలు. ఎపుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ జిల్లాల ప్రాధాన్యత చాలా ఉంటుంది. 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి వచ్చిన మెజారిటీతోనే చంద్రబాబు జగన్ ని అధిగమించి అధికార పీఠం సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ మొత్తానికి మొత్తం ఊడ్చేసింది. కంచుకోటలు కాస్తా టీడీపీకి మంచుకోటలుగా మారిపోయాయి. కేవలం ఆరంటే ఆరు సీట్లు మాత్రేమ పసుపు పార్టీ పరమయ్యాయి. ఈ నేపధ్యంలో రాజకీయంగా టీడీపీకి పెద్ద అండ లేకుండా పోయింది. ఉన్నంతలో శ్రీకాకుళం నుంచి గెలిచిన అచ్చెన్నాయుడు బాబుకు కుడిభుజం అయ్యారు. ఇపుడు ఆయన్ని అరెస్ట్ చేయడం ద్వారా పొలిటికల్ సీన్ మొత్తం మార్చేసినట్లైంది.ఉత్తరాంధ్ర జిల్లాల్లో కింజరాపు కుటుంబానికి నాలుగు దశాబ్దాల ‌ చరిత్ర ఉంది. ఎన్టీయార్ ఓ టైంలో టికెట్ ఇవ్వకపోతే సొంతంగా ఇండిపెండెంట్ గా నిలబడి నిలిచి గెలిచిన చరిత్ర దివంగత నేత ఎర్రన్నాయుడుది. ఆయన వారసుడిగా 1996లో రాజకీయాల్లో అడుగుపెట్టిన తమ్ముడు అచ్చెన్నాయుడు గత పాతికేళ్ళుగా తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆయన అన్నగారి కంటే దూకుడు పెంచి మరీ శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటున్నారు. ఇపుడు ఆయన్ని అరెస్ట్ చేయడం ద్వారా వైసీపీ రాజకీయంగా బిగ్ షాట్ నే కొట్టిందని అంటున్నారు.ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి అచ్చెన్నకు లేదా ఆయన అన్న కుమారుడు, ఎంపీ రామ్మోహననాయుడుకు దక్కుతుందని అంతా ఊహిస్తున్నారు. చంద్రబాబు సైతం ఉత్తరాంధ్రాకు ఉన్న ప్రాధ్యాన్యత. పార్టీ మళ్ళీ అక్కడ నిలబడాలంటే కింజరాపు కుటుంబం అండదండలు ఉండాలన్న ఉద్దేశ్యంతో కీకలమైన పార్టీ పదవులు వారికే ఇవ్వాలనుకుంటున్నారు. ఆ కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఇపుడు ఉన్నారు. ఇంతటి ఘోరమైన పరాజయంలో కూడా మూడు పదవులు సాధించడం ద్వారా కింజరాపు ఫ్యామిలీ నేతలు పొలిటికల్ గా తమ సత్తా చాటుకున్నారు. దాంతో బాబు కూడా వారి మీద ఆధారపడుతున్నారు. ఇపుడు ఏసీబీ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసింది. ఆయన ఈఎస్ఐ స్కాంలో ఇరుక్కోవడంతో పార్టీ పదవులు ఆ కుటుంబానికి ఇవ్వడానికి పెద్ద అడ్డుగా మారుతుంది అంటున్నారు.జగన్ ఎపుడైతే విశాఖను రాజధానిగా ప్రకటించారో నాటి నుంచి ఉత్తరాంధ్రా మీద పట్టు కోసం వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే మిగిలిన రెండు జిల్లాల సంగతి ఎలా ఉన్నా శ్రీకాకుళం వరకూ మాత్రం అచ్చెన్నాయుడు సహా కింజరాపు కుటుంబం కొరకరాని కొయ్యగా ఉందని అంటున్నారు. దాంతో ఏసీబీ విచారణ తో ఉచ్చు బిగించి రాజకీయంగా అక్కడ పై చేయి సాధించేందుకు వైసీపీ సరికొత్త వ్యూహాన్ని సిధ్ధం చేసిందని అంటున్నారు. ఓ విధంగా ఇది టీడీపీకి ఇబ్బందికరమైన పరిణామంగా చెబుతున్నారు. మరో వైపు సీబీఐ, సీఐడీ, ఏసీబీల తో వైసీపీ సర్కార్ చూపిస్తున్న దూకుడుతో తమ్ముళ్లలో ఒక్కసారిగా కలవరం మొదలైంది అంటున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.

Related Posts