YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా 12న ప్రధాని మోదీ నిరాహార దీక్ష

ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా 12న ప్రధాని మోదీ నిరాహార దీక్ష

ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌కు ప్రతిపక్షాలు పదేపదే అడ్డు తగిలినందుకు నిరసనగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి మోదీ ఒక రోజు నిరాహార దీక్ష చేయబోతున్నారు.ఈ నెల 12న గురువారం కర్ణాటకలో ఈ ఇద్దరూ నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అందరూ బీజేపీ ఎంపీలు ఈ నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. దళితులపై దాడికి నిరసనగా రాజ్‌ఘాట్ దగ్గర కాంగ్రెస్ చేసిన నిరాహార దీక్షకు కౌంటర్‌గా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. నిరాహార దీక్ష ఐడియా ప్రధాని మోదీదేనని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగకపోవడం వల్ల ప్రజలకు ఎంత నష్టం జరిగిందో తమకు తెలుసని చెప్పే ప్రయత్నంలో భాగంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అందుకే ఆ23 రోజుల జీతాలను తీసుకోవడానికి కూడా ఎన్డీయే ఎంపీలంతా నిరాకరించిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.

Related Posts