YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అచ్చెన్న... నెక్స్ట్ ఎవరు

అచ్చెన్న... నెక్స్ట్ ఎవరు

అచ్చెన్న... నెక్స్ట్ ఎవరు
విజయవాడ, జూన్ 13,
అసలే అంతంత మాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి అచ్చెన్నాయుడు అరెస్ట్ తో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాలపై విచారణలు వేశారు తప్పించి ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. రాజధాని భూముల కొనుగోళ్లలో అనేక అక్రమాలు జరిగాయని ఇప్పటికే స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణ చేస్తుంది. ఈ కేసులో కూడా మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలు ఉన్నారు.ఈఎస్ఐ స్కామ్ గత ప్రభుత్వ హయాంలో జరిగింది. మాజీ మంత్రి అచ్చం నాయుడు కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో స్కామ్ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. మంత్రి హయాంలో మొత్తం 988 కోట్ల రూపాయల మేరకు కొనుగోళ్లు జరిగాయి. ఇందులో 150 కోట్ల రూపాయల పై చిలుకు స్కామ్ జరిగినట్టుగా ఏసీబీ అధికారులు తేల్చారు . 150 కోట్ల రూపాయల మేరకు కుంభకోణానికి పాల్పడిన ట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.టీడీపీలో అచ్చెన్నాయుడు బలమైన గొంతుకగా ఉన్నారు. శాసనసభలో ఉప పక్ష నేతగా ఉన్న అచ్చెన్నాయుడు ఇటు శాసనసభలోనూ, అటు బయటా ప్రభుత్వ వైఖరిని ఎండగడతారు. తొలి నుంచి టీడీపీలోనే రాజకీయాలు కొనసాగిస్తున్న అచ్చెన్నాయుడు అరెస్ట్ టీడీపీ నేతల్లో భయాందోళనలు కల్గిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన అచ్చెన్నాయుడు అరెస్ట్ తో మిగిలిన టీడీపీ నేతలు పూర్తి స్ధాయిలో అధికార పార్టీకి సరెండర్ అయిపోతారన్న టాక్ పార్టీలో విన్పిస్తుంది.ఇప్పటికే అనేక మంది తెలుగుదేశం నేతలపై కేసులు ఉన్నాయి. అయినా ఇప్పటి వరకూ అరెస్ట్ లు జరగలేదు. తొలి అరెస్ట్ పెద్ద నేతతో ప్రారంభం కావడంతో టీడీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాయలసీమలోని జేసీ బ్రదర్స్ పై కూడా కేసులు నమోదయి ఉన్నాయి. నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు కూడా రాజధాని భూ కుంభకోణంలో కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అచ్చెన్నాయుడు అరెస్ట్ ఇబ్బందికరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
 

Related Posts