YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 సంక్షోభంలో టీడీపీ

 సంక్షోభంలో టీడీపీ

 సంక్షోభంలో టీడీపీ
విజయవాడ, జూన్ 13,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎపుడూ ఒకే మాట చెబుతూ వస్తూంటారు. సంక్షోభాల నుంచే సమాధానాలు వెతుక్కోవాలని. ఇపుడు తెలుగుదేశం పార్టీ పెను సంక్షోభంలో ఉంది. ఎన్నడూ లేనంతగా పార్టీ దిగజారిపోయింది. ఓ వైపు అధినేత చంద్రబాబు వయోభారానికి తోడు, సహకరించని నాయకులు, మరో వైపు మధ్యాహ్న మార్తాండుడులా జగన్ చెలరేగిపోతున్న వ్యవహారం. ఇవన్నీ చూసుకున్నపుడు టీడీపీ మునిగిపోయే పడవ అనిపించకమానదు. ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాటల్లో చెప్పాలంటే టీడీపీ ఓడకు అతి పెద్ద బరువు లోకేష్ బాబుట. ఆయనతోనే పార్టీ నిండా మునగడం ఖాయమని కూడా ఆయన జోస్యం చెప్పేశారు.ఇదిలా ఉండగా తాజాగా లోకేష్ జగన్ సర్కార్ మీద పెట్టిన మీడియా సమావేశం కొంత సంచలనంగానే ఉంది. లోకేష్ ఈ సమావేశంలో చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించారు. ఆయన తన తండ్రి చెప్పినట్లుగా సంక్షోభాల నుంచే సమాధానాలు వెతుక్కున్నారా అనేలా ప్రెస్ మీట్ లో బాగానే రాణించారు. జగన్ ఏడాది పాలనలో ఒక్కో తప్పునూ లోకేష్ ఏకరువు పెట్టారు. జగన్ కి పాలించే అర్హత లేదనేశారు. రాజారెడ్డి రాజ్యాంగం తప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని జగన్ అసలు అనుసరించడంలేదని కూడా లోకేష్ భారీగానే విమర్శలు చేశారు. ఓ విధంగా లోకేష్ మీడియా మీట్ వైసీపీలో ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి.చినబాబు తన నాయకత్వ లక్షణాలను పూర్తిగా నిరూపించుకోకపోయినా నిండా నిరాశతో ఉన్న టీడీపీకి ఇలాంటి వేళ కాస్తా బూస్టింగ్ ఇచ్చారనే చెప్పాలి. లోకేష్ జగన్ మీద గట్టిగానే బాణాలు వేశారు. జగన్ లో అసలు అవగాహన ఏదీ పాలన మీద హాట్ కామెంట్స్ చేశారు. గతంలో అయితే లోకేష్ మాటలలో తడబాట్లు ఉండేవి, ఇపుడు ఆయన మాటలు సూటిగానే పదును తేరి మరీ ఉంటున్నాయి. మొత్తం మీద చూసుకుంటే లోకేష్ రాటుతేలారు అని చెప్పకతప్పదు.లోకేష్ ఏమీ కాదు అంటున్న వైసీపీ నాయకులకు ఆయన మాటల మంటలు మాత్రం బాగానే అంటుకున్నాయని అనిపించకమానదు. వైసీపీ వారి వరస ప్రెస్ మీట్లూ, ట్వీట్లను బట్టి అది అర్ధమవుతోంది. మాజీ మంత్రి పార్ధసారధి నుంచి ఇటు రోజా వరకూ అంతా లోకేష్ మీద గట్టిగానే పడ్డారు. చినబాబు ఓడిపోయారని, పారిపోయారని, మళ్ళీ ఇన్నాళ్ళకు ప్రెస్ మీట్ల పేరిట జనంలోకి వచ్చారంటూ వైసీపీ సెటైర్లు వేశారు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా ఏడాదికి 87 వేల కోట్లు వైసీపీ సర్కార్ అప్పు తెచ్చిందా, జనాల మీద యాభై వేల కోట్లు పన్నులు వేసిందా? వీటిని వైసీపీ నేతలు సమాధానాలు చెప్పాల్సిఉందిగా. ఎంతసేపూ చినబాబూ పెదబాబూ అంటూ తిట్టడం కాకుండా విపక్షంగా లోకేష్ అడిగిన విమర్శలకు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీ మీద ఉంది. మరో వైపు చూసుకుంటే లోకేష్ బాగానే రాటుదేలారని అంటున్నారు తమ్ముళ్ళు, ఇకపైన చంద్రబాబు డైరెక్షన్, లోకేష్ యాక్షన్ తో టీడీపీ ముందుకు దూసుకుని వస్తుందని అంటున్నారు. చూడాలి.

Related Posts