YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

జేసీ ప్రభాకరరెడ్డి అరెస్ట్

జేసీ ప్రభాకరరెడ్డి అరెస్ట్

జేసీ ప్రభాకరరెడ్డి అరెస్ట్
హైద్రాబాద్, జూన్ 13 
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన జేసి ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతపురం కు తరలిస్తున్నారు. రవాణాశాఖలో జరిగిన అక్రమాలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి పై పోలీసులు కు నమోదు చేశారు. నకిలీ పత్రాలను సృష్టించి బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చిన కేసులో వీరిద్దరూ నిందితులు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ తో అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 

Related Posts