YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అదీ జగన్ స్టైల్ : జేసీ

అదీ జగన్ స్టైల్ : జేసీ

అదీ జగన్ స్టైల్ : జేసీ
అనంతపురం, జూన్ 13,
తన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్‌పై మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి స్పందించారు. ప్రభాకర్‌రెడ్డిపై ఆరోపణలు నిజమేనని.. అస్మిత్‌రెడ్డికి ఏమీ తెలియదు, ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. అరెస్ట్‌లను కోర్టుల్లో ఎదుర్కొంటామని.. నేరం చేయకున్నా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించగలదని వ్యాఖ్యానించారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టగలిగే సమర్థులు వైఎస్సార్‌సీపీ నేతలని.. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. జగన్ చేసే పనులకు అధికారులంతా జీ హుజూర్ అంటున్నారని.. అధికారులు చెప్పే మాటను జగన్ వినరన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతుందనే చంద్రబాబు, లోకేష్‌ను అరెస్ట్ చేయడం లేదన్నారు జేసీ. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చంద్రబాబు జోలికి వెళ్తే రాష్ట్రం అల్లకల్లలోం అవుతుందని.. చంద్రబాబు వెంట ఉంటున్నవారిని అరెస్ట్ చేసి భయబ్రాంతులకు గురిచేయాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమన్నారు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని కుట్రని.. బ్రిటీష్ కంటే ఘోరమైనది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమన్నారు. 'మావాడు ఎవర్నీ లెక్కచేయరు' అంటూ జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తన చిన్నాన్న అరెస్ట్ అన్యాయమన్నారు జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి. విచారణ ఎదుర్కొనేందుకు పోలీసుల ఎదుట హాజర సిద్ధంగాయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించినా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. అనారోగ్యంతో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయడం సరికాదన్నారు. అసలు సూత్రధారులను వదిలివేసి బాధితుడైన తన చిన్నాన్నను అరెస్ట్ చేయడం రాజకీయ కక్షగా వ్యాఖ్యానించారు. తమకు మోసపూరితంగా అమ్మిన అశోక్ లేలాండ్ కంపెనీ..‌మధ్యవర్తిత్వం వహించిన ముత్తును విచారణ కూడా చేయకపోవడంతోనే ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని అర్ధమవుతోందన్నారు.మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని నివాసంలో జేసీతో పాటూ కుమారుడ్ని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. వారిని అనంతపురానికి తరలించారు. 154 బస్సులు నకిలీ ఎన్వోసీ, ఫేక్ ఇన్స్యూరెన్స్ కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు బీఎస్ 3 వాహనాల విషయంలో కూడా వీరిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ వ్యవహారంలో వారిపై గతంలోనే కేసులు నమోదు చేశారు.

Related Posts