YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ నేతల ఆరెస్టు

కాంగ్రెస్ నేతల ఆరెస్టు

కాంగ్రెస్ నేతల ఆరెస్టు
భద్రాద్రి జూన్ 13
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పిసిసి పిలుపు మేరకు ప్రాజెక్ట్ ల సందర్శన కు వెళ్తున్న కాంగ్రేస్ సీనియర్ నేతలను కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా లోని సీతారామ ప్రాజెక్ట్ వెళ్ళేందుకు హైదరాబాద్ నుండి వస్తున్న కాంగ్రేస్  సీనియర్ నేత వి హనుమంతారావు, మాజీ యం ఎల్ సి రాములు నాయక్ లను కొత్తగూడెం లో పోలీసులు అరెస్ట్ చేసి లక్ష్మీదేవిపల్లి స్టేషన్ తరలించారు. పోలీసుల వైఖరి పట్ల విహెచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతియుతంగా వెళ్తుంటే అరెస్ట్ ఏంటని ప్రశ్నించారు. పోలీస్ రాజ్యంగా తెలంగాణా : రాములు నాయక్ తెలంగాణా పోలీస్ రాజ్యంగా మారిందని మాజీ యం ఎల్ సి, కాంగ్రేస్ నేత రాములు నాయక్ విమర్శించారు. కొత్తగూడెం లో అరెస్ట్ ల పట్ల నిరసన వ్యక్తం చేశారు. శాంతియుత కార్యక్రమాలను అడ్డుకోవటం విచారకరమన్నారు.

Related Posts