YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన కొనసాగుతుంది

 రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన కొనసాగుతుంది

 రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన కొనసాగుతుంది
 సిఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగిన టిపిసిసి అద్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబద్ జూన్ 13
రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన కొనసాగుతుందని టిపిసిసి అద్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డివిమర్శించారు.నేడు మీడియా సమావేశం లో మాట్లాడుతూఅందరినీ జీవితాల్లో వెలుగులు నిండాలని కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షించింది..కానీ అరేండ్ల లలో ఆ వెలుగు లు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేసారు.ప్రజలు , నిరుద్యోగులు ప్రభుత్వం పై అసంతృప్తి తో ఉన్నారన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని  అన్ని అబద్దాలే ప్రజలకు చెబుతున్నాడని దుయ్యబట్టారు. ప్రాజెక్టు ల విషయం లో కూడా ఇవే అబద్దాలు చెబుతున్నాడన్నారు.అసలు కేసీఆర్ ఏమి అభివృద్ధి చేస్తున్నాడో ప్రజలకు వివరించాలని ప్రాజెక్ట్ లను సందర్శించాలనుకున్నామన్నారు.కానిఇవ్వాళ కూడా అరెస్ట్ చేశారు.జూన్ 2 న కృష్ణా పరివాహక ప్రాజెక్ట్ ల వద్దకు వెళ్తుంటే అరెస్ట్ చేశారు..కాంగ్రేస్ హయాం లో మొదలు పెట్టిన ప్రాజెక్ట్ లను పక్కన పెట్టి కమీషన్ ల కోసం  ప్రాజెక్ట్ లను డిజైన్ చేసిండని ఆరోపించారు.కేసీఆర్ రాష్ట్రాన్ని దోపిడి చేస్తున్నారు...ఆయనకు కు కొంత మంది పోలీసు అధికారులు తొత్తులుగా మారారని ప్రతిపక్షాన్ని తొక్కేయాలని అనుకుంటున్నారన్నారు.తెలంగాణ లో ప్రజాస్వామ్యం ఈ విధంగా ఉంటుందని అనుకోలేదు.చాలా మంది పోలీస్ లు అధికారులు చిత్త శుద్ది తో పని చేస్తున్నారు.కానీ ఇప్పుడు కొంత మంది అధికారులు కేసీఆర్ కు తొత్తుగా మారారు..రాష్ట్రంలో ఐపిఎస్ లు గా కాకుండా కెపిఎస్ లు మారారు..సీఎం కేసీఆర్ కు, కేటిఆర్ , మంత్రులకు  గానీ టిఆర్ఎస్  నేతలకు ఏలాంటి కోవిడ్ ఆంక్షలు ఉండవు ..కాంగ్రెస్ నేతలకే కోవిడ్ 19  ఆంక్షలు ఉంటాయా? అని ప్రశ్నించారు.కేటీఆర్ మీటింగ్ లు పెట్టి కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేస్తారు. మీటింగ్ పెట్టుకునేందుకు పర్మిషన్ ఉంటుంది..మంత్రి జగదీష్ రెడ్డి కూడా ప్రతి రోజు వందల మందితో మీటింగ్ లు పెడతాడు...కానీ ఆయన కు కూడా  అనుమతులు ఉంటాయి...నా పార్లమెంట్ నియోజకవర్గం నల్లగొండ లో ని  ఎస్ఎల్బీసీ  ప్రాజెక్ట్ పనులు పరిశీలన కు వెళ్లకుండా పోలీస్ లు అడ్డుకున్నారు...మంజీరా డ్యాం ను పరిశీలించేందు కు వెళ్తుంటే అరెస్ట్ చేశారు... కేసులు పెట్టారు..కరెంటు బిల్లులు పై మంత్రులను , అధికారులను కలవాలనుకున్నాం...ఇందులో తప్పేముంది డిజిపి?ప్రాజెక్ట్ ల సందర్శిస్తున్నామని డిజిపి కి లేఖ రాసిన సమాధానం లేదు...కరోన వ్యాప్తి నివారణ కోసంయూనియన్ హోం మినిస్ట్రీ  నోటిఫికేషన్  విడుదల చేశారని రాష్ట్ర పోలీస్ లు చెబుతున్నారు..హోమ్ మినిస్ట్రీ నోటిఫికేషన్ కాంగ్రెస్ పార్టీ నేతలకే వర్తిస్తుందా? తెరాస నేతలకు వర్తించదా?డీజీపీ మహేందర్ రెడ్డి అనే వ్యక్తి నోరు మెదపడం లేదుఫోన్ కూడా ఎత్తడం లేదు...ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల వాయిస్ ను వినిపిస్తాం.ఇది హక్కు.. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..అణిచివేయలని చూస్తే ఊరుకునేది లేదు..ఇదేమి జాగీర్ కాదు..ఏ పొరటనికైనా సిద్ధమే...కేసీఆర్, డీజీపీ, హైదరాబాద్ కమిషనర్  లు నాటకం ఆడుతున్నరూ..కాంగ్రెస్ నేతల పట్ల పోలీస్ లు వ్యవరిస్తున్న తీరుపై గవర్నర్ ను కలుస్తాంకేంద్ర పెద్దలను కలుస్తాంపోలీస్ ల తీరు పై న్యాయ పోరాటం కూడా  చేయబోతున్నాం మాస్ని తెలిపారు.2004 నుంచి 2014 ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం  33 ప్రాజెక్టు ల ను లక్ష కోట్ల తో మొదలు పెట్టినంమేము మొదలు పెట్టిన ప్రాజెక్ట్ లను రీ డిజైన్ చేయడం, పనులు సరిగా చేయకపోవడం , నిధులు సరిగా విడుదల చేయకపోవడం  చేస్తున్నారు కేసీఆర్ కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీ కి పేరు వస్తుందని కేసీఆర్ అనుకుంటున్నరూ..అందుకే ఆ ప్రాజెక్ట్  ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నాడు.8% కమీషన్ ల కోసం ఇతర ప్రాజెక్ట్ ల ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు..తుమ్మడి హెట్టి దగ్గర ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు.ఇక్కడ ప్రాజెక్టు కట్టి ఉంటే జాతీయ హోదా వచ్చేది...కొండా పోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం అయినా నెల అయిందో లేదో కాలువ కు గండి పడింది....పనులు ఎంత నాణ్యత తో ఈ ప్రాజెక్టు  ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.

Related Posts