YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చైనాలో కొత్తగా కరోనా కేసులు

చైనాలో కొత్తగా కరోనా కేసులు

చైనాలో కొత్తగా కరోనా కేసులు
హైదరాబాద్‌ జూన్ 13
చైనాలో కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దాంట్లో దేశ రాజధాని బీజింగ్‌లోనే ఆరు కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించినట్లు కొన్ని మీడియా సంస్థల ద్వారా తెలుస్తోంది. బీజింగ్‌లోని జిన్‌ఫాడి హోల్‌సేల్‌ మార్కెట్‌ ప్రాంతంలో కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ మార్కెట్‌లో ఉన్న 45 మంది అనుమానితుల గొంతు శ్యాంపిళ్లను సేకరించారు. వారందరికీ కరోనా పాజిటివ్‌ తేలింది. కొత్తగా కరోనా కేసులు బయటపడడంతో.. సీఫుడ్‌, మీట్‌ ప్రోడక్ట్స్‌ షాపులపై బీజింగ్‌లో పర్యవేక్షణ మొదలైంది. ఆ సిటీలో ఉన్న అన్ని సూపర్‌మార్కెట్ల నుంచి సాల్మన్‌ చేపలను తొలగించారు. దిగుమతి చేసిన సాల్మన్‌ చేపలను వెంటనే తమ షెల్వ్స్‌ నుంచి తీసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.బీజింగ్‌ మార్కెట్ల నుంచి సుమారు 1940 మందికి న్యూక్లియిక్‌ యాసిడ్‌ పరీక్ష చేపట్టారు.  దాంట్లో 517 శ్యాంపిళ్లు.. జిన్‌ఫాడి మార్కెట్‌ నుంచి సేకరించారు. ఆ లిస్టులో 45 మందికి కరోనా సోకినట్లు తేలింది. హైదియాన్‌ జిల్లాలోని ఓ ఫార్మ్‌ మార్కెట్‌లో జరిపిన పరీక్షల్లోనూ కొందరికి పాజిటివ్‌ వచ్చింది. మొత్తం 46 మందికి వైరస్ సోకినా.. వారిలో లక్షణాలు మాత్రం బయటపడలేదు. 

Related Posts