కర్ణాటక మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు.
మంత్రాలయం జూన్ 13
కర్ణాటక నుంచి ఆంధ్రా కు మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రాలయం సిఐ. కృష్ణయ్య పేర్కొన్నారు. శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దకడుబూరు మండలం కంపాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు కర్ణాటక మద్యం సరఫరా చేస్తున్నారని సమాచారం అందడంతో ఎస్సై వేణుగోపాల్ రాజు ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ కృష్ణ కానిస్టేబుల్ శ్రీరాములు హోంగార్డు రఘు అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తులను చిలకలదోన కల్లుదెవకుంట మధ్యలో పట్టుకోవడం జరిగింది. ఏపీ 39 ఎక్స్ 9217 నెంబర్ గల ఆటోలో కర్ణాటక మద్యం 180 ఎంఎల్ ప్యాకెట్లు దాదాపు 471 ప్యాకెట్లు 45 వేల రూపాయలువిలువ చేసే మద్యం పట్టుకోవడం జరిగిందని ఆటోను సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తక్కువ ధరకు మద్యం దొరుకుతుందని కక్కుర్తి పడి కర్ణాటక మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ద్విచక్ర వాహనాలు కానీ ఆటోలు కానీ కార్లు ,జీపులు ఇలాంటి వాహనాలలో మద్యం సరఫరా చేస్తే మద్యం వ్యక్తులతో పాటు వాహనాలను కూడా సీజ్ చేస్తామని ఆ వాహనాలను తిరిగి ఇచ్చేది లేదని ఆయన సూచించారు. ఎవరు సొంత వాహనదారులు అక్రమ మద్యం సరఫరా చేసే వారికి వాహనాలను ఇచ్చి మీరు ఇబ్బంది పడవద్దు అని సూచించారు. అలాగే అక్రమ మద్యం రవాణా పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని అందులో భాగంగానే పోలీసులు 24 గంటలు కాపలా కాస్తుంటారు అని తెలిపారు. కాబట్టి కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేసిన బెల్టుషాపులు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ ఆపరేషన్ లో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణ కానిస్టేబుల్ శ్రీరామ్ హోంగార్డు రఘులకు సి ఐ కృష్ణయ్య ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు వేణుగోపాల్ రాజు, ఎర్రన్న పోలీసులు నటరాజు ,జయన్న శ్రీరాములు పాల్గొన్నారు.