YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిరు పేద ప్రజలకు అండగా జగనన్న ప్రభుత్వం

నిరు పేద ప్రజలకు అండగా జగనన్న ప్రభుత్వం

నిరు పేద ప్రజలకు అండగా జగనన్న ప్రభుత్వం
నెల్లూరు జూన్ 13
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుపేద ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాల అభివృద్ధి సంక్షేమానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉందని నెల్లూరు జిల్లా ఎంఆర్పిఎస్ సంఘాల నాయకులు పేర్కొన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో శనివారం నిర్వహించిన సీమంద్ర ఎమ్మార్పీఎస్, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ ఐక్యత సంఘం, ఎస్సీ ఎస్టీ బిసి సేవా సమితి తదితర సంఘాల ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పరిపాలన సాగిస్తుందని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. గత టిడిపి పాలనలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి, ఎస్సీ ఎస్టీల అభివృద్ధిని అడ్డుకోవడం జరిగింది అని ఆరోపించారు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు టిడిపి తీరని అన్యాయం చేసిందని ధ్వజ మెత్తారు. నూతనంగా పరిపాలనలోకి వచ్చిన వైకాపా అధికారిక ప్రభుత్వం పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత, రైతులకు రైతు మిత్ర, రైతు భరోసా కార్యక్రమాలు, నిరుపేద జిల్లా సొంత ఇంటి కల నెరవేరే విధంగా అందరికీ ఇంటి నివేశన స్థలాలు పంపిణీ, ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర, చేనేత వృత్తి దారులకు నేతన్న నేస్తం, చేతి పని వాళ్లకు వడ్డీ లేని రుణాలు తదితర అభివృద్ధి సంక్షేమ పథకాలు వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన సేవలను కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నవరత్నాలు పేరుతో తొమ్మిది రకాల అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సేవలను కొనియాడారు. అందరికీ ఇంటి నివేశన స్థలాలు పంపిణీ చేసే క్రమంలో కొంతమంది నిరుపేదల భూములను అక్రమంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వస్తున్న కథనాలకు ప్రభుత్వం స్పందించి, ఒక నిరుపేద గూడు కోసం మరి ఒక నిరుపేద కడుపు కొట్టడం సరికాదని, ఈ విషయమై ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించారు. వైయస్ జగన్ ప్రభుత్వంలోనూ జిల్లాలో అక్కడక్కడ దళిత గిరిజనుల పై అగ్రవర్ణాల వారు చేస్తున్న ఆగడాలను అదుపు చేయాలని తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి వినిపించారు. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పందిరి వెంకటసుబ్బయ్య, హిందీ ఎస్ టి బి సి చైర్మన్ కాకి శ్రీనివాసులు, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కుడుముల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts