YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 గోదావరి జలదీక్షలు.. నేతల అరెస్ట్

 గోదావరి జలదీక్షలు.. నేతల అరెస్ట్

 గోదావరి జలదీక్షలు.. నేతల అరెస్ట్
హైద్రాబాద్, జూన్ 13
గోదావరి నదిపై పెండింగ్‌ ప్రాజెక్టులను పరిశీలించడం కోసం కాంగ్రెస్ పార్టీ నేడు ‘గోదావరి జలదీక్ష’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితర నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తున్న వీహెచ్‌ను కూడా ఇంట్లో నిర్బంధించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.నేతల హౌస్ అరెస్ట్ పట్ల కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రాజెక్టుల సందర్శన కోసం వెళ్తున్న తమను అడ్డుకోవద్దని డీజీపీకి ఉత్తమ్ లేఖ రాశారు. భౌతిక దూరం పాటిస్తూ.. తాము జలదీక్ష చేపట్టాలని చూశామని.. అయినప్పటికీ అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన చేపట్టడం తప్పా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.గోదావరి జలదీక్ష షెడ్యూల్ ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద ఉత్తమ్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, దుమ్ముగూడెం వద్ద భట్టి, వీహెచ్ తదితరులు పాల్గొనాల్సి ఉండగా.. దేవాదుల ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే సీతక్క, ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద పొన్నం ప్రభాకర్‌, దాసోజు శ్రవణ్‌ పాల్గొనాల్సి ఉంది.ములుగు ప్రాంతంలోని 9 మండలాల్లో తలుపునే గోదావరి ఉన్న తాగటానికి నీళ్ళు లేవని.. ఇతర ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. గోదావరి పక్కనే ఉన్న తమ ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వకపోవడం దారుణమన్నారు. మీ ప్రాంతానికే మీరు ముఖ్యమంత్రి కాదు.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రాంతానికి గోదావరి నీళ్లు ఇచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలను నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైద్రాబాద్, జూన్ 13,

Related Posts