YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

యాదాద్రిలో ఐదు లక్షల మంది ఓటర్లు

యాదాద్రిలో ఐదు లక్షల మంది ఓటర్లు

స్థానిక సంస్థల  ఎన్నికలను దృష్టిలో  రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను  సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాల పెంపు, బోగస్ ఓటర్ల ఏరివేత, కొత్త ఓటర్ల నమోదు చేపట్టేందుకు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమాలు చేపట్టింది. జిల్లాలో అక్టోబర్ నుంచి మూడు నెలలపాటు ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్ చేపట్టగా, జనవరి నుంచి మార్చి వరకు ఓటర్ల సవరణ ప్రక్రియ చేపట్టారు. అదేవిధంగా జిల్లాలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో అక్టోబర్ నుంచి మూడు నెలల పాటు స్పెషల్ సమ్మరి రివిజన్  పేరిట ఓటర్ల సవరణ ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రక్రియ ద్వారా జిల్లాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారన్న విషయాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చింది. గడిచిన మార్చిలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేసి ఆయా రాజకీయ పార్టీల నాయకులకు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఆ జాబితా ప్రకారం జిల్లాలో 5,34,844 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మొత్తం 2,71,756 మంది పురుషుల ఓటర్లు ఉండగా, 2,63,048 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 40 మంది ఉన్నారు. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో జనాభాకు సరాసరి ఓటర్లు ఉన్నారని భావించిన ఎన్నికల సంఘం బోగస్ ఓటర్ల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. 2017 అక్టోబర్‌లో ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్ పేరిట జనవరి వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. భువనగిరి నియోజక వర్గంలోని భువనగిరిలో 34,511 మంది పురుషుల ఓటర్లు, 34,230 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 6 మంది ఉన్నారు. బీబీనగర్‌లో 17,497 మంది పురుషుల ఓటర్లు, 16,540 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. భూధాన్‌పోచంపల్లిలో 17,948 మంది పురుషుల ఓటర్లు, 16,961 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వలిగొండలో 20,507 మంది పురుషుల ఓటర్లు, 19,399 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 90,463 మంది పురుషుల ఓటర్లు, 87,130 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 6 మందితో కలిపి 1,77,599 మంది ఉన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరులో 14,294 మంది పురుషుల ఓటర్లు, 14,305 మంది మహిళా ఓటర్లు, ఇతరులు ఒకరు ఉన్నారు. ఆత్మకూరు(ఎం)లో 12,154 మంది పురుషుల ఓటర్లు, 11,542 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. బొమ్మలరామారంలో 12,827 మంది పురుషుల ఓటర్లు,12,405 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గుండాలలో 11,013 మంది పురుషుల ఓటర్లు, 10,688 మంది మహిళా ఓటర్లు, ఇతరులు ఒకరు ఉన్నారు. రాజాపేటలో 13,008 మంది పురుషుల ఓటర్లు, 13,023 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 2 మంది ఉన్నారు. తుర్కపల్లిలో 11,728 మంది పురుషుల ఓటర్లు, 11,493 మంది మహిళా ఓటర్లు, ఇతరులు ఒకరు ఉన్నారు. యాదగిరిగుట్టలో 16,592 మంది పురుషుల ఓటర్లు, 16,404 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 16 మంది ఉన్నారు. మోటకొండూర్‌లో 9,187 మంది పురుషుల ఓటర్లు, 8,764 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,08,803 మంది పురుషుల ఓటర్లు, 98,624 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 21 మందితో కలిపి 1,99,448 మంది ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌లో 24,786 మంది పురుషుల ఓటర్లు, 23,641 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 2 మందిఉన్నారు. సంస్థాన్‌నారాయణపురంలో 15,695 మంది పురుషుల ఓటర్లు, 14,954 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 2 మంది ఉన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేటలో 19,296 మంది పురుషుల ఓటర్లు, 18,428 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరులో 11,334 మంది పురుషుల ఓటర్లు, 10,964 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 2 మంది ఉన్నారు. అడ్డగూడూరులో 9,379 మంది పురుషుల ఓటర్లు, 9,307 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 7 మంది ఉన్నారు.

Related Posts