YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వారసుడి కోసం...కసరత్తు

వారసుడి కోసం...కసరత్తు

వారసుడి కోసం...కసరత్తు
హైద్రాబాద్, జూన్ 13,
టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉత్తమ్ కుమర్ రెడ్డి వారసుడి నియామకం కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కసరత్తు జరుగుతున్న వేళ.. ముగ్గురు సీనియర్ నాయకులు ప్రత్యేకంగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడగా.. పీసీసీ చీఫ్ పదవిని వదులుకోవడానికి ఉత్తమ్ సిద్ధపడ్డారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య గట్టి పోటీ ఉంది. దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా రేసులో ఉన్నారు.రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి గత కొంత కాలంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్‌ను ఫామ్‌హౌస్ విషయంలో రేవంత్ ఇరుకున పెడుతున్నారు. రేవంత్ రెడ్డి పట్ల హైకమాండ్ ఒకింత సానుకూల దృక్పథంతోనే ఉన్నప్పటికీ.. పార్టీలోని వ్యతిరేక వర్గం మాత్రం ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే సహించబోమని వార్నింగ్ ఇస్తోంది. దీంతో కోమటిరెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందనే వార్తలు వెలువడ్డాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి సీఎల్పీ ఆఫీసులో ఇటీవలే సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలనే ప్రతిపాదనను జగ్గారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో అధిష్టానానికి ఏం చెప్పాలనే విషయమై ఈ ముగ్గురు నేతలు చర్చించినట్లు సమాచారం. తమలో ఒకరికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలని వీరు అధిష్టానాన్ని కోరనున్నారా లేదంటే తమకు నచ్చిన నాయకుడి పేరును సిఫారసు చేయనున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. గ్రూప్ రాజకీయాలతో పీసీసీ చీఫ్ ఎంపిక మరింత సంక్లిష్టం అయ్యే అవకాశం ఉంది.

Related Posts