ముద్దులతో ముంచెత్తుతాను
హైద్రాబాద్, జూన్ 13
కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో గత రెండున్నర నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు సినీ తారలు. ప్రభుత్వ నిబంధనలను గౌరవిస్తూ షూటింగ్స్ అన్నీ రద్దు చేసుకున్నారు. అయితే ఈ మధ్యే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్డౌన్ సడలింపులు ఇస్తున్న క్రమంలో సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంటి నుంచి బయటకొచ్చిన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కారులో షికారు చేస్తూ ఎంజాయ్ చేసింది. ఈ జర్నీలో తన తల్లికి ముద్దులు పెడుతూ ఫిదా చేసింది.తన తల్లితో కలిసి కారులో షికారుకు బయల్దేరిన సాయి పల్లవి.. ముందు సీట్లో కూర్చొని వెనుక సీటులో కూర్చున్న తల్లికి అద్దంలో ముద్దుపెడుతూ చాలా డిఫరెంట్గా ఫొటో దిగింది. పైగా ఆ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ అమ్మడు.. ''అవకాశం దొరికినప్పుడల్లా నా ప్రేమతో అమ్మను ఉక్కిరిబిక్కిరి చేస్తాను'' అని కామెంట్ చేసింది. డిఫరెంట్ పిక్, అంతకంటే డిఫరెంట్ కామెంట్ కావడంతో క్షణాల్లో ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం దగ్గుబాటి రానా సరసన 'విరాటపర్వం' సినిమాలో నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర చిత్రానికే మేజర్ అసెట్ కానుందని టాక్. మరోవైపు నాగచైతన్యతో 'లవ్ స్టోరీ' కూడా నడిపిస్తోంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి పల్లవి చేసిన ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకలోకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది