YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 రాష్ట్రంలో రాచరికపు పాలన

 రాష్ట్రంలో రాచరికపు పాలన

 రాష్ట్రంలో రాచరికపు పాలన
 ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుంటే అడ్డుకుంటారా....?
స్వేచ్చను హారిస్తారా...
కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
జగిత్యాల జూన్ 13 
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుంటే ప్రభుత్వం పోలీసులచే  అడ్డుకోవడం రాచరికపు, నిజాం పాలనను  తలపిస్తోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టుల్లో బాగంగా శనివారం ఉదయం తుమ్మిడిహెట్టి సందర్శనకు వెళ్తున్న జీవన్ రెడ్డి ని జగిత్యాల  పట్టణ సిఐ జయేష్ రెడ్డి ఆధ్వర్యంలో  పోలీసులు ఇంటినుంచి వెళ్ళకుండా కారుకు అడ్డుగా నిల్చొని అనుమతి లేకుండా, కరోనా సమయంలో ఎలాంటి అనుమతులు లేవని అరెస్టు చేసి గృహనిర్బంధంలో ఉంచారు.ఈసందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. మనం తెలంగాణలో ఉన్నామా..? నిషేధిత ప్రాంతంలో ఉన్నామా అని పోలీసులను ప్రశ్నించారు.  తెలంగాణ లో  ప్రజలకు, ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛలేదని , పోలీసుల రాజ్యం నడుస్తోందన్నారు. కరోనా సమయంలో భౌతిక దూరం పాటిస్తున్నాయి, అంతేగాకుండా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రాజెక్టు లో ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజాధనం దుర్వినియోగం జరిగిన విషయాన్ని ప్రశ్నించడంతో పాటు ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు సందర్శించి అక్కడ నీటిలభ్యత ఏవిధంగా ఉంది ప్రజలకు వాస్తవాలును వివరించడానికిి వెళ్తుఃటే పోలీసులతో అడ్డుకోవడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రచార ఆర్బాటాలకే తప్పా ప్రజాసంక్షేమం పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. కరోనా ను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, డాక్టర్లు, రోగులకు రక్షణలేకుండా పోయిందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, నిరసనలేకుండా , శాంతియుతంగా వెళ్తున్న మమ్ములను అడ్డుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఉదయమే టిపిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, నాయకులు మన్సూర్, నక్కజీవన్, కచ్చు హరీష్ తదితరులను అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్లో ఉంచారు. జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ తాటిపర్తి విజయలక్ష్మి ఇంటివద్ద పోలీసులు చేరుకుని ఆమెతో పాటు దేవేందర్ రెడ్డి ని  బయటకు వెళ్లకుండా హౌజ్ అరెస్టు చేశారు. జీవన్ రెడ్డి ని గృహ నిర్బంధంలో ఉంచారని తెలుసుకుని కాంగ్రెస్ శ్రేణులు ఆయన ఇంటిముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఈకార్యక్రమంలో బతికపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి, నాయకులు గాజంగి నందయ్య, నారాయణ రెడ్డి, గుంటి జగదీశ్వర్, కోర్టు శ్రీనివాస్, పులి రాము, కోండ్ర జగన్, రఘువీర్ గౌడ్, బాస ప్రకాష్   తదితరులు ఉన్నారు.
 

Related Posts