వైసిపి నాయకుల ఇసుక దోపిడీ
కడప జూన్ 14
కడప జిల్లాలో ఏడాదిగా ఇసుక దోపిడీ వైసిపి నాయకుల చొరవతో జరుగుతుందని బిజెపి కడప అసెంబ్లీ ఇంచార్జ్ కందుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ బ్లాక్ లో ఇసుకను వైసిపి నాయకులు విక్రయించుకుంటూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నరాన్నరు. సామాన్యుడికి ఇసుక దొరకడం కష్టంగా ఉండటంతో జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటైతే క్రింది స్థాయి లో జరిగేది ఇంకొకటి కొద్ది రోజులు వరదల పేరుతో మరికొద్ది రోజులు కొత్త పాలసీ పేరుతో కాలయాపన చేసిన కారణంగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ప్రస్తుత ఆన్లైన్లో ఇసుక దొరుకుతుంది అన్నారు కానీ ఎప్పుడు చూసినా ఆన్లైన్ లో బుకింగ్ ప్లాంటు దొరకడంలేదు. వైసీపీ వాళ్లకు మాత్రమే బుకింగ్ దొరుకుతుంది దీన్ని బట్టి చూస్తే వాళ్ళ అరాచకాలు ఎంతగా ఉన్నాయో అర్థమవుతుంది. అధికారులు కూడా చూస్తూ ఊరుకున్నారు. తప్పు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ దినము రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు జిల్లా సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న ఇసుక డిపోను పరిశీలించి అక్కడ ఉన్న వారితో మాట్లాడడం జరిగింది అన్నారు. ప్రస్తుతం అక్కడ 97 వేల టన్నుల ఇసుక ఉంది కానీ బుకింగ్ కావడం లేదు అధికారులు వెంటనే బుకింగ్ చేయుటకు అవకాశం కల్పించాలని కందుల శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్, జయ శ్రీనివాస్, పవన్, వినోద్, నాగేంద్ర, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు