YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దొంగలను ఇట్టే పట్టుకుంటున్న నిఘా కళ్లు

దొంగలను ఇట్టే పట్టుకుంటున్న నిఘా కళ్లు

నిఘా కన్నుతో పోలీసులు కేసులను  సులువుగా ఛేదిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రజా భద్రతకు నిఘా కళ్ల ఏర్పాటుకు ప్రాధాన్యం పెరిగింది. ఈ విషయంపై పోలీసుశాఖ దృష్టి సారించింది. వ్యక్తిగత, వ్యాపార భద్రత కోణంలోనూ పట్టణాల్లో అవగాహన పెరగడంతో వేలల్లో సీసీ కెమెరాల ఏర్పాటువుతున్నాయి. సీసీ కెమెరాలను దుకాణాలు, గృహాల్లోనే కాకుండా కొందరు తమ విలువైన వాహనాలకు కూడా అమర్చుతున్నారు. వాహనం ఎదుట, వెనుక నిఘా కెమెరాలుంటాయి. రహదారుల ప్రమాదాలు, వాహనాలను ఎవరైనా కర్రలు, రాళ్లతో కొట్టినా వీటి ఆధారంగా పట్టుకోవచ్చు. ఎవరైనా తరచూ తమ వాహనాన్ని వెంబడించినా వెంటనే గమనించవచ్చు. ఇలా జిల్లాలో వెయ్యికిపైగా వాహనాలకు  సీసీ కెమెరాలను అమర్చినట్లు పోలీసు అధికారులు, సంబంధిత వ్యాపారుల అంచనాను బట్టి తెలుస్తోంది.సీసీ కెమెరాలు ప్రస్తుతం మార్కెట్లో విరివిగా అందుబాటులోకి వచ్చాయి. కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు ప్రాంతాల్లోనూ ఇవి లభ్యం అవుతున్నాయి. రూ.3 వేల నుంచి రూ.3 లక్షలపై వరకు ఇవి లభ్యం అవుతున్నాయి. వీటిని అమర్చితే భరోసాగా ఉంటుందని వ్యాపారులు, గృహ యజమానులు పేర్కొంటున్నారు. వీటిని గమనిస్తున్న దొంగలు కూడా ఆయా ప్రాంతాల్లో ఆగడాలు చేసేందుకు జంకుతున్నారని మణుగూరు పట్టణానికి చెందిన ఓ వ్యాపారి తెలిపారు. విరివిగా నిఘా కళ్లు ఉన్న ప్రాంతాల్లో నేరాల సంఖ్య కూడా తగ్గినట్లు మణుగూరుకు చెందిన ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.: కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాల్లో సింగరేణి యాజమాన్యం భారీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. కాలనీలు, కార్యాలయాలు, బొగ్గుగనుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మణుగూరులో బండారుగూడెం-పీవీకాలనీ వరకు నిఘా కెమెరాల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. పోలీసులు సింగరేణి సహాయం కోరడంతో యాజమాన్యం స్పందించి వీటిని ఏర్పాటు చేస్తోంది.

Related Posts