YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

రష్యాలో 5.20లక్షలు దాటిన కరోనా కేసులు

రష్యాలో 5.20లక్షలు దాటిన కరోనా కేసులు

రష్యాలో 5.20లక్షలు దాటిన కరోనా కేసులు
మాస్కో జూన్14
ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యాలో కరోనా విజృంభిస్తున్నది. గత నెలరోజులుగా ప్రతిరోజూ సగటున 8వేల మందికి  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది.    శనివారం కొత్తగా 8,706 మందికి వైరస్‌ సోకినట్లు కరోనా రెస్పాన్స్‌ సెంటర్‌ తెలిపింది.  దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 5,20,129కు పెరిగింది. గడచిన 24 గంటల్లో మరో 114 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 6,829కు చేరింది.తాజాగా 5,271 మంది డిశ్చార్జ్‌ కావడంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 274,641కు చేరింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల జాబితాలో రష్యా మూడో స్థానంలో ఉన్నది.

Related Posts