సనాతనధర్మాన్ని రక్షించడమంటే అసలు అర్ధమేమిటి?
ఎలాగైతే కాపరి పశువులను రక్షిస్తాడో అలా రక్షించడమా? కాదు.
ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడం. ధర్మాన్ని తాను ఆచరించడం, ఇంకొకరి చేత ఆచరింపజేయడంవల్ల ధర్మం రక్షింపబడుతుంది.
వెనకటికాలంలో ఎంతోమంది ఎన్నోరకాల అనుష్ఠానాలు చేసేవారు . తమ పిల్లలకు వేరే దేశాలకు పంపిస్తారో..లేదో...అనేది వేరే విషయం. మొట్టమొదటగా వారిని సంస్కారవంతులుగా తయారు చేసేవారు.
మా పిల్లలు ధనవతులు కాకపోతే ఏమైపోతారని భయపడేవారు కాదు. అయ్యో ! మా పిల్లలు సంస్కారహీనులైతే ఏమైపోతారు? అని ఆలోచించేవారు. ఆ సంస్కారమే వారికి అన్ని రకాల శ్రేయస్సులను అందజేస్తుంది. కాబట్టి చిన్ననాటినుండే రామాయణ, భారత, భాగవత పురన ఇతిహాసాదులన్నీ చెప్తుండే వారు. దానితో వారి మనస్సులో అద్భుతమైన సంస్కారం ఏర్పదేఅది. ఆ సంస్కారం చిన్నవయసులో కలిగితే, ఆ సంస్కారమే వారిచేత ధర్మ చరణ చేయిస్తుంది. అప్పుడు ధర్మాన్ని రక్షించడం అవుతుంది. మన చేత ఆచరించబడిన ధర్మం పుణ్యంగా మారి మనకు ఈ లోకంలో, పరలోకంలోనే కాక తరువాతి జన్మలకు కూడా శ్రేయస్సును, సుఖాన్ని అనుగ్రహిస్తుంది. ఈ విధంగా ఆచరణతోనే సనాతన ధర్మం రక్షింపబడుతుంది.
అదే
సనాతన ధర్మస్య ధర్మో రక్షతి రక్షితః
హిందూ ధర్మాన్ని కాపాడుదాం