తన సినిమాతో ఆత్మహత్య వద్దన్న బాలీవుడ్ నటుడు సుశాంత్ నిజ జీవితంలో ఓడిపోయాడు
ముంబై: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం యావత్ సినీ లోకాన్ని తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసింది. తన నటనతో ఎంతోమంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ యాక్టర్ అర్థాంతరంగా తనువు చాలించడం అందరినీ కలిచివేస్తోంది. సుశాంత్ సింగ్ సినిమాల ద్వారా ఓ వైపు వినోదాన్ని అందిస్తూనే..మరోవైపు ప్రేక్షకులను మంచి సందేశాన్ని ఇచ్చేందుకు కూడా ప్రయత్నించాడు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని చిచ్చోరే సినిమా ద్వారా సుశాంత్‌సింగ్ సందేశాన్ని ప్రజలు, అభిమానులకు అందించాడు. అయితే ఆత్మహత్యతో సమస్యలు పరిష్కారం కావంటూ రీల్ లైఫ్‌లో చెప్పిన సుశాంత్ నిజజీవితంలో మాత్రం ఆ మాటను ఫాలో కాలేదు. చివరకు తానే ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా జీవితానికి ముగింపు పలికాడు. టీవీ సీరియల్స్ తో అలరించి బాలీవుడ్ యువ హీరోగా ధోని చిత్రం తో మంచిపేరు తెచ్చుకున్నారు .ఈమధ్యనే ఆయనకు సెక్రటరీ కూడా ఆత్మహత్య చేసుకున్నారు . తన కుమారుడి ఆత్మహత్య ఫై విచారణ చెయ్యాలని సుశాంత్ తండ్రి ప్రధాని మోడీకి విన్నవించారు