YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బాబు అంచనాలు తలకిందలవుతున్నాయా

బాబు అంచనాలు తలకిందలవుతున్నాయా

బాబు అంచనాలు తలకిందలవుతున్నాయా
విజయవాడ, జూన్ 15,
తెలుగుదేశం పార్టీ ఒక్కడితో మొదలైంది. ఒక్క ఆలోచనతో ఆరంభమైంది. నలభై మందితో ఒక గదిలో పార్టీ ప్రకటన వచ్చింది. ఇక ఆ తరువాత జనంలోకి ఎన్టీయార్ వెళ్ళేంతవరకూ టీడీపీ కాగితం మీద పార్టీనే. అలాంటిది అన్న గారి చైతన్య రధం అలా కదలగాలే వెల్లువలా జనం వచ్చి నీరాజనం పట్టారు. ఆనాడు ఉమ్మడి ఏపీలో ఉన్న ఆరు కోట్ల మంది ప్రజానీకం ఎన్టీయార్ కి జేజేలు పలికారు. దాంతో ప్రపంచ రికార్డ్ స్రుష్టించి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీయార్ ముఖ్యమంత్రి అయిపోయారు. మరి ఒక్కడు పెట్టిన పార్టీకి కోట్ల మంది ఎలా అభిమాన జనం అయ్యారు అంటే అంతా ఎన్టీయార్ చరిష్మా అని చెప్పాలి.ఎన్టీయార్ కి పొలిటికల్ గ్లామర్ ఉండేది. దానికి గ్రామర్ అద్దిన ఘనత అల్లుడు చంద్రబాబుది. ఆ తరువాత తానే ఏపీ సీఎం అయ్యారు బాబు. ఇక బాబు పాతికేళ్ళుగా టీడీపీ ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. తన పొలిటికల్ గ్రామర్ తోనే పార్టీని నడుపుతున్నారు. గ్లామర్ మాత్రం లేకుండానే బండి సాగుతోంది. ఇపుడు ఆ గ్లామర్ కూడా కరిగిపోతోంది. అందుకే చంద్రబాబును నమ్ముకుంటే అసలుకే మోసమని నేతలు భావించబట్టే ఎదుటి పార్టీలోకి దూకేస్తున్నారు అంటున్నారు.వెళ్ళిపోయిన వారి వల్ల ఏమీ కాదు అని చంద్రబాబు అంటున్నారు. అలా వెళ్ళిన వారు చరిత్ర హీనులు అని కూడా గట్టిగా తిట్ల పురాణం లంకించుకుంటున్నారు. నిజంగా పోయిన వారు అలాంటి వారే అయితే వారి గురించి తలవడం అనవసరమే. కరణం బలరాం కానీ, వల్లభనేని వంశీ కానీ జగన్ వేవ్ లో కూడా గెలిచారు అంటే వారికి ప్రజాబలం లేదని అనుకోగలమా. ఇక మాజీ మంత్రి శిధ్ధా రాఘవరావు వైసీపీలో చేరినంతమాత్రాన ఆయన నిన్నటివరకూ ఉన్న ఆయన రాజకీయ‌ పలుకుబడి ఒక్కసారిగా తగ్గిపోతుందా. చంద్రబాబు తన తప్పులు తెలుసుకోకుండా ఎదుటివారి మీద నిందలు వేస్తూ పోయిన వారు పోనీ అంటే టీడీపీ నావ మునగాల్సిందేగా.పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారు కనుమరుగు అయ్యారని చంద్రబాబు అంటున్నారు. మరి పార్టీని ధిక్కరించి బయటకు వెళ్ళిన కేసీయార్ ఏమయ్యారు. ఏకంగా హైదరాబాద్ లోనే చంద్రబాబుకు, ఆయన పార్టీకీ రాజకీయ ఉనికి లేకుండా చేశారు కదా. అదే విధంగా తలసానిశ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ లాంటి వారు మంత్రులు కాలేదా. వారంతా పొలిటికల్ గా ఎక్కడా ఫేడౌట్ అయిపోలేదుగా. ఇక ఏపీలో తీసుకుంటే గత ఏడాది టీడీపీని వదిలిన ముత్తంశెట్టి శ్రీనివాస్ వైసీపీలో మంత్రి అయ్యారుగా. ఇలాగే చాలా మంది టీడీపీ నాయకులు వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారుగా. టీడీపీ ఇపుడు చాలా ఇబ్బందులో ఉంది. దాన్ని చక్కదిద్దుకోవడం మరచి బాబు ఎంతమంది పోయినా పార్టీఎని నిర్మిస్తాను అంటున్నారు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కానీ పదేళ్ళ క్రితం నాటి రాజకీయమూ కాదు, టీడీపీకి ఇపుడు ఆ బలమూ లేదన్నది గుర్తుంచుకోవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related Posts