YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 టీడీపీ ఖేల్ ఖతమైనట్టేనా

 టీడీపీ ఖేల్ ఖతమైనట్టేనా

 టీడీపీ ఖేల్ ఖతమైనట్టేనా
విశాఖపట్టణం, జూన్ 15, 
ఏ ఒక్కరిని వదల బొమ్మాళి వదల… అని ఎన్నికల ముందు రంకెలు వేసింది వైసీపీ. పోలవరం, అమరావతి నుంచి ప్రతీ దాంట్లో టిడిపి మంత్రులు, ఎమ్యెల్యేలు, నేతలు పందికొక్కుల్లా ప్రజాధనం తినేశారు అంటూ ఆరోపణలు చేసింది వైసీపీ. అడ్డగోలుగా తిన్నది అంతా కక్కించి తమ సర్కార్ అధికారంలోకి రాగానే బొక్కలో పడేస్తామని గొప్పలు చెప్పింది. చంద్రబాబు నుంచి గల్లీ స్థాయి వరకు నేతలు మేతే మేత అంటూ ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన ఫ్యాన్ పార్టీ అధికారంలోకి రానే వచ్చింది. గతంలో చేసిన ఆరోపణలు విమర్శలనే మళ్ళీ ఏడాదిపాటు చేసింది తప్ప తినేశారు అన్న వారిపై కేసులు అదిగో ఇదిగో అంటూ కాలక్షేపం చేసేసింది. వైసీపీ వ్యవహారం బిజెపికి అస్సలు నచ్చలేదు. టిడిపి పని వైసిపి ఖతం చేస్తే తొందరగా సైకిల్ స్థానం భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉంది కమలం.ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చింది. ఈ ఎస్ ఐ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయగానే పాత బిజెపి నేతలు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. మాజీ మంత్రి మాణిక్యాలరావు ఓపెన్ గానే అచ్చెన్న అరెస్ట్ ను స్వాగతించడం పరిశీలిస్తే టిడిపి ఖేల్ ఖతం కోసం కమలం వేచి చూస్తున్న ధోరణి తేటతెల్లం అవుతుంది. ఇదే రూట్ లో గతంలో జరిగిన అన్ని అవకతవకలు బయట పెట్టి తప్పు చేసిన వారిని బయటపెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.ఇదే దూకుడు ను జగన్ సర్కార్ చూపాలని ఎప్పటి నుంచో పాత బిజెపి నేతలు వేచి చూస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వం అరుపులు తప్ప పని లో ఆ స్పీడ్ ప్రదర్శించకపోవడంతో కమలం నేతలు అధికార పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. రెండు పార్టీలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నాయని పెద్ద ఎత్తునే ప్రచారం చేస్తున్నాయి. తాజాగా అచ్చెన్న అరెస్ట్ వారిలో ఆనందం నింపింది. అయితే పాత నేతలకు భిన్నంగా కమలం లో కొత్తగా వచ్చి చేరిన నేతలు ముఖ్యంగా టిడిపి నుంచి వచ్చిన వారు మాత్రం అచ్చెన్న అంశం లో సైలెంట్ కావడం విశేషం.

Related Posts