YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 మాజీలకు గేట్లు తీశారు..

 మాజీలకు గేట్లు తీశారు..

 మాజీలకు గేట్లు తీశారు..
విజయవాడ, జూన్ 15
మాజీ నేత‌ల‌కు, సీనియ‌ర్ నాయ‌కులకు తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎప్పుడె ప్పుడు పార్టీలోకి వ‌చ్చి.. అధికార పార్టీ కండువా క‌ప్పుకొందామా ? ఎప్పుడెప్పుడు.. మేం కూడా వైసీపీ నేత‌ల మ‌ని చెప్పుకొందామా ? అని ఎదురు చూస్తున్న మాజీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు తాజాగా జ‌గ‌న్ నుంచి పిలుపు వెళ్లేందుకు రంగం సిద్దమైంద‌ని తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వం త‌ర‌ఫున చేయా ల్సిన అన్ని కార్యక్ర‌మాల‌ను చేసేసిన నేప‌థ్యంలో వారంలో కొన్ని రోజులు పార్టీకి కేటాయించాల‌ని జ‌గ‌న్ నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సీనియ‌ర్లకు అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణయించుకున్నట్టు పార్టీ వ‌ర్గాల్లో విస్తృత‌మైన చ‌ర్చ సాగుతోంది. మాజీ కేంద్ర మంత్రులు.. ప‌న‌బాక ల‌క్ష్మి, కోట్ల సూర్యప్ర‌కాశ్ రెడ్డి, కావూరి సాంబ‌శివ‌రావులు వైసీపీలోకి చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు. వాస్తవానికి కావూరి ఆదిలో బీజేపీకి జైకొట్టినా.. త‌ర్వాత ఆయ‌న ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఆయ‌న పోటీకి దూరంగా ఉన్నారు. ఆ స‌మ‌యంలోనే వైసీపీ నుంచి ఆహ్వానం అందింది. అయితే, అప్పట్లో ఆయ‌న ఆరోగ్య కార‌ణాల రీత్యా మౌనంగా ఉన్నారు.కానీ, గ‌డిచిన నెల రోజులుగా ఆయ‌న జ‌రుగుతున్న మంత‌నాలు కొలిక్కి వ‌చ్చాయ‌ని, ఆయ‌నే స్వయంగా వ‌చ్చి పార్టీలో చేరేందుకు ఎదురు చూస్తున్నారని .. తాజాగా వైసీపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. అదేవిధంగా నిన్న మొన్నటి వ‌ర‌కు జ‌గ‌న్‌ను తిట్టిపోసిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా సైకిల్ దిగిపోయేందుకు రెడీ అయ్యారు. టీడీపీని వీడ‌న‌ని రెండు మూడు నెల‌ల కింద‌ట కూడా చెప్పిన ఆయ‌న అనూహ్యంగా పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న నామినేటెడ్ ప‌ద‌వి కానీ, టీటీడీలో స‌భ్యత్వం కానీ ఇచ్చేందుకు ఓకే అన్నార‌నే ప్రచారం సాగుతోంది.ఇక‌, ప‌న‌బాక లక్ష్మి.. కూడా ఎప్పటి నుంచో వైసీపీలోకి వ‌చ్చేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌నే వార్తలు వ‌స్తున్నా యి. అయితే, ఆమె భ‌ర్త కృష్ణయ్యకు ఏదైనా నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తే.. బెట‌ర్ అనే విష‌యంలో చ‌ర్చలు సాగాయి. ఇక‌, ఇప్పుడు ఎలాంటి ష‌ర‌తులు లేకుండానే జ‌గ‌న్ చెంత‌కు చేరుతున్నార‌ని ప‌న‌బాక విష‌యంలో వైసీపీ నేత‌లు అంటున్నారు. ప్రస్తుతం రాబోయే వారం పదిరోజుల్లోనే వీరి చేరిక ఉంటుంద‌ని చెబుతున్నారు. పార్టీలో ఎవ‌రు వ‌చ్చినా.. తీసుకుంటామ‌ని జ‌గ‌న్ ఇప్పటికే ప్రక‌టించిన నేప‌థ్యంలో ఇంకెంత మంది వ‌స్తారో చెప్పలేమ‌ని.. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉండే స‌ల‌హాదారు న‌ర్మగ‌ర్భంగా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

Related Posts