YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు

 జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు

 జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు
హైద్రాబాద్, జూన్ 15,
ముఖ్యమంత్రి జగన్ అపాయింట్‌మెంట్ తమకు దొరకడం లేదంటున్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. సీఎం అపాయిట్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదో తెలియదని.. పార్లమెంట్ సమావేశాల సమయంలో రెండుసార్లు పిలిచారు కలిశాను అన్నారు. ఢిల్లీ వచ్చినప్పుడు కలుద్దామనుకున్నానని.. కరోనా వల్ల సీఎం ఢిల్లీ రావడం లేదన్నారు. ఇక్కడ కలిసే అవకాశం తమకు లేదని.. దీన్ని ఓపెన్‌గా సిగ్గు విడిచి చెప్పుకుంటున్నాను అన్నారు. సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని చెప్పుకోవడానికి ఏమైనా గర్వకారణమా.. బాధతోనే చెప్పుకుంటున్నాను అన్నారు.పార్టీ మారతారంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని రఘురామకృష్ణంరాజు కొట్టిపారేశారు. అయితే ఇటీవల తన నియోజకవర్గానికి సంబంధించి పార్టీలో చేరిన నేతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ముఖ్యమంత్రి పక్క చూపులు చూసి ప్రముఖ బీజేపీ నేత గంగరాజు కుమారుడు రంగరాజును తెచ్చుకున్నారని.. తాను పక్క చూపులు చూడటం లేదన్నారు. సీఎం ముందు చూపుతో ఆయన్ను తీసుకొచ్చారేమో తనకు తెలియదని.. తనకు కనీసం మాట మాత్రం చెప్పకుండానర్సాపురం పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారన్నారు. సీఎం జగన్ పక్క చూపులు చూస్తున్నారేమో.. తాను మాత్రం ఆ పక్క చూపుల్ని పట్టించుకోవడం లేదన్నారు రఘురామ. తాను ఓ ఛానల్‌లో చెప్పిన్నట్లు.. ఒకవేళ తనకు సీటు ఇవ్వకపోయినా వేరే పార్టీ నుంచైనా పోటీ చేస్తానన్నారు. ఎవరు ఏ చూపు చూసినా తాను మాత్రం సీఎంనే చూస్తున్నాను అన్నారు. ఆయన ప్రేమ దక్కకపోతే అప్పుడు నిర్ణయం తీసుకుంటానంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. తాను పార్టీ నుంచి సస్పెండ్ కావాల్సిన అవసరం ఏంటని.. వైఎస్సార్‌సీపీలోకి రావడానికి టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయని.. అందరూ మా పార్టీలోకి రావాలనుకుంటుంటే తాను ఎందుకు పార్టీ మారతానని ప్రశ్నిస్తున్నారు.

Related Posts