YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

యదేఛ్చగా ఫారిన్ లిక్కర్

యదేఛ్చగా ఫారిన్ లిక్కర్

యదేఛ్చగా ఫారిన్ లిక్కర్
హైద్రాబాద్, జూన్ 15, 
హైదరాబాద్ ఫారాన్ లిక్కర్ గుప్పుమంటుంది. విదేశీ మద్యాన్ని కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తుండటంతో దళారులు ఆక్రమంగా వీటిని నగరానికి తరలిస్తున్నారు. పలు దేశాలకు చెందిన మద్యాన్ని  ఇక్కడకు తీసుకొచ్చి వాటిని ఇక్కడ అమ్ముతూ సోమ్ము చేసుకుంటున్నారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం విదేశీ మద్యం అమ్మకాలు నిషేధం. అయితే మహానగరంలో విదేశీ మద్యాన్ని మంచి డిమాండ్ ఉంది. ప్రధానంగా ఉన్నతవర్గానికి చెందిన పలువురు విదేశీ మద్యం తాగడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే వారి ఇళ్లలో జరిగే శుభాకార్యాల్లో విదేశీ మద్యం విధిగా ఉంటుంది. దీంతో శుభకార్యాలు చేసుకునే వారిని దళారులు కలిసి వారి అవసరానికి తగినట్లు విదేశీ మద్యం సరఫరా చేస్తున్నారు. పలు దేశాల నుంచి వాయు, జల రవాణా ద్వారా చైన్నై,ముంబాయి , కొచ్చిన్‌ల వరకు విదేశీ మద్యాన్ని తరలిస్తున్నారు. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాలు, బస్సులను మద్యం రవాణాకు దళారులు వినియోగిస్తూ నగరానికి గుట్టుగా తరలిస్తున్నారు. కీలకవ్యక్తులు వెనుక ఉండి ఉపాధి కోసం నగరానికి వచ్చిన నిరుద్యోగులను మద్యం రవాణాకు వినియోగించుకుంటున్నారు. అదేవిథంగా ఆబ్కారీ శాఖ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేందుకు ఇక్కడ వైన్‌షాపుల్లో లభించే మద్యం సీసాలను అధికారికంగా శుభకార్యాలు చేసేవారితో కొనుగోలు చేయిస్తున్నారు. వీటితో పాటు విదేశీ మద్యాన్ని శుభకార్యాల్లో గుట్టుగా సరఫరా చేస్తున్నారు. నగరంలోని హోటళ్లు, నగర శివార్లలోని ఫంక్షన్‌హాళ్లలో జరిగే కొన్ని శుభాకార్యాలల్లో విదేశీ మద్యం ఏరులై ప్రవహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆక్రమ విదేశీ మద్యం అమ్మకాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతుంది. కొంతకాలంగా పలు దేశాల నుంచి పెద్ద ఎత్తున విదేశీ మద్యం హైదరాబాద్‌కు తరలి వస్తుందని అబ్కారీ శాఖ అధికారులు గుర్తించారు. విదేశాల నుంచి మద్యం జల,వాయు మార్గాలలో వస్తుందని ఆబ్కారీ అధికారులు దర్యాప్తులో తేలింది. దీంతో మహానగరంలోని పలు ప్రాంతాల్లో అధికారులు నిఘా పెట్టి ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అధికారుల తనిఖీల్లో భారీ ఎత్తున విదేశీ మద్యం పట్టుబడుతోంది. ఈ సందర్భంగా విదేశీ మద్యాన్ని ఆక్రమంగా తరలిస్తున్న దళారులపై అధికారులు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్న ఈ దందా మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో మహానగరంలో విదేశీ మద్యం అమ్మకాలను పూర్తిస్ధాయిలో ఆరికట్టే దిశగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా విదేశీ మద్యాన్ని ఇక్కడ తరలిస్తున్న కీలక వ్యక్తులను అరెస్టు చేసే దిశగా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అదేవిధంగా శుభాకార్యాల్లో విదేశీ మద్యం సరఫరా అవుతున్నట్లు వస్తున్న ఆరోపణల క్రమంలో నగరంలో జరిగే శుభకార్యాలపైన కూడ నిఘా పెట్టాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.

Related Posts