రామ్ చరణ్. ఉపాసన ల పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం
నెల్లూరు జూన్15
నెల్లూరు నగరం లో రామ్ చరణ్ యువత అద్వర్యం లో రామ్ చరణ్ ఉపాసన ల పెళ్లి రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గీతమయి వృద్ధ ఆశ్రయం నందు 8 కిలోల కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేసి ఆ పెద్దల ఆశీర్వాదం మా మెగా జంటకి అందించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు.. సుజయ్ బాబు అతిథిలుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మా చరణ్ బాబు ఉపాసన ల పెళ్లి రోజు సందర్భంగా నేడు ఈ పెద్దల సమక్షంలో బారి కేక్ కట్ చేసి అన్నదానం చేసి వారి నిండు ఆశీర్వాదం అందించిన రామ్ చరణ్ యువత నాయకులు శ్రీకాంత్ రెడ్డి కి .హరికృష్ణ కి సాయి మోహన్ కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మా మెగా వారసుడు చరణ్ బాబు కి ఉన్నతమైన కుటుంభం నుంచి మంచి సేవా భావాలు కలిగిన ఉపాసన భార్య రావడం గొప్ప విషయం అని భారత దేశం గర్వించే స్థాయి లో ఇద్దరు ఉండాలి అని తెలిపారు . సుజయ్ బాబు మాట్లాడుతూ మా చరణ్ తేజ్ హీరోగా .ఉపాసన సేవా రంగంలో దూసుకుపోతున్న సందర్భంగా రామ్ చరణ్ బాబు ఉపాసన దంపతులు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి పెళ్లి రోజులు మరిన్ని జరుపుకోవాలని మెగా కుటుంభం పేరు ఉన్నత స్థాయి లో ఉండాలని ఆకాంక్షించారు.