YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

 ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

 ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం
వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు గుర్తించాలి 
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ భాష
 కడప, జూన్15 
 ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్  బి. అంజాద్ బాషా పేర్కొన్నారు.  సోమవారం ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రజలు తమ సమస్యల పరిష్కారంపై ఉప ముఖ్యమంత్రి  కి వినతి పత్రాలు సమర్పించారు.   ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ భాష మాట్లాడుతూ ప్రజల సమస్యలపై వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు.  ఈ సందర్భంగా 31 వ డివిజన్ పరిధిలోని మోచంపేట, గుర్రాల గడ్డ, బ్రాహ్మణ వీధి, భవాని నగర్, ప్రాంత ప్రజలకు అనుకూలంగా అందుబాటులో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు వినతి పత్రం సమర్పించారు.31వ డివిజన్ పరిధిలో జన సంచారం అధికంగా ఉంటుందని ఎక్కువగా పేదలు నివసించే ప్రాంతమని బాధితులు తెలిపారు. ప్రస్తుత కరోనా సమయంలో దగ్గు, జలుబు, జ్వరం, వచ్చినప్పుడు రిమ్స్ కు వెళ్లాలంటే రిమ్స్ ఆసుపత్రి దూరంగా ఉన్నందున చాలా ఇబ్బందిగా ఉందన్నారు. కావున ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాంతంలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ను నిర్మించాలని వారు వినతి పత్రం సమర్పించారు. ఇందుకు స్పందించిన ఉపముఖ్యమంత్రి వర్యులు సంబంధిత అధికారులతో మాట్లాడి హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. 31 వ డివిజన్ రామారావు స్ట్రీట్ కు చెందిన ఎల్. లలితమ్మ తనకు సొంత ఇల్లు లేదని చాలా కాలంగా బాడుగ ఇంట్లో నివసిస్తున్నామన్నారు. కావున తనకు ఇంటి స్థలం మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో 2008 సంవత్సరం నుంచి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) లో 60 మంది  కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేస్తున్నామని వారిని పర్మినెంట్ చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధితులు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. బాధితుల సమస్యలన్నీ సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కరిస్తామని ఉపముఖ్యమంత్రి వర్యులు తెలిపారు. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు గుర్తించాలన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు వారి ముంగిటకు చేరే విధంగా అధికారులకు తెలియజేసి తగు చర్యలు చేపట్టాలన్నారు.      ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సురేష్ బాబు, 31 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అజ్మతుల్లా, వైయస్సార్ సిపి నాయకులు దాసరి శివప్రసాద్, జావిద్, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు షఫీ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts