YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రేపు అసెంబ్లీలో ఏమీ జరగదు.. బిల్లు పాస్ చేసుకోవడం తప్ప: జేసీ

రేపు అసెంబ్లీలో ఏమీ జరగదు.. బిల్లు పాస్ చేసుకోవడం తప్ప: జేసీ

రేపు అసెంబ్లీలో ఏమీ జరగదు.. బిల్లు పాస్ చేసుకోవడం తప్ప: జేసీ
అనంతపురం జూన్ 15 
);: వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఎవరు ఎదురుపడినా వారిని ఫినిస్ చేస్తారన్నారు. కేసులు ఉన్నా.. లేకపోయినా ఇబ్బంది పెట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో రేపు ఏమీ జరగదు.. అవసరమైతే టీడీపీ వాళ్లను బయటకు పంపేసి బిల్లు పాస్ చేసుకుంటారని తెలిపారు. ‘‘జేసీ ప్రభాకర్‌రెడ్డి, అశ్విత్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్‌లో పేర్లు లేవు... అయినా అరెస్ట్ చేశారన్నారు. ఇప్పటివరకు తనపై ఎటువంటి కేసులు లేవు. రేపు ఒక కేసు సృష్టించి లోపల పడేస్తారు... అనుభవించాల్సిందే.. తమ కుటుంబంపై ఎంతగా ప్రేమాభిమానాలు ఉన్నాయో తెలిపేందుకే నారా లోకేష్ మా ఇంటికి వచ్చారు. వాహనాలు అమ్మిన వారిని, ఏజెంట్లను, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా..  అక్రమంగా మా కుటుంబంపై కేసులు నమోదు చేశారు. బెయిల్ పిటిషన్ వేస్తున్నాం.. తప్పకుండా బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాం.’’ అని  జేసీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Posts