YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఆశ‌లు చిగురింప‌జేస్తున్న చైనా టీకా!

ఆశ‌లు చిగురింప‌జేస్తున్న చైనా టీకా!

ఆశ‌లు చిగురింప‌జేస్తున్న చైనా టీకా!
హైద‌రాబాద్‌ జూన్15
కరోనా మహమ్మారిని క‌ట్ట‌డి కోసం వ్యాక్సిన్ క‌నిపెట్ట‌డానికి చైనాలోని ఔష‌ధ త‌యారీ సంస్థ‌ సినోవ్యాక్ బయోటెక్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఆశ‌లు చిగురింప‌జేస్తున్నాయి. తమ ప్రయత్నాలు ఫలించి మందు మార్కెట్లోకి వస్తే వేల ప్రాణాలు నిలువరించిన వారమవుతామని ఆ సంస్థ ఇటీవ‌ల పేర్కొన్న‌ది. తాము తయారు చేసిన టీకా సానుకూల ఫలితాలను ఇస్తున్న‌ద‌ని సినోవ్యాక్ బయోటెక్ తెలిపింది.మానవులపై ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ టీకా మొదటి రెండు దశలు పూర్తి చేసుకుంద‌ని, 'కరోనా వ్యాక్స పేరుతో అభివృద్ధి చేస్తున్న‌ ఈ టీకాను మొత్తం 743 మందిపై ప్రయోగించామని సినోవ్యాక్ పేర్కొన్న‌ది. 18-59 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్నవారిపై ఈ టీకా ప్రయోగాలు చేసిన‌ట్లు వెల్ల‌డించింది. టీకా తీసుకున్న 14 రోజుల తర్వాత వారిలోని 90 శాతం మందిలో కరోనా వైరస్‌తో పోరాడే యాంటీ బాడీలు ఉత్పన్నం అయ్యాయని స్ప‌ష్టంచేసింది. త‌మ వ్యాక్సిన్ తీసుకున్న వారికి తీవ్రస్థాయి దుష్ప్రభావాలు ఏమీ ఎదురుకాకపోవడం ఊరటనిచ్చే అంశమ‌ని, ఇక మూడో దశ ట్రయల్స్ దేశం బయట నిర్వహించాలనుకుంటున్నామ‌ని సినోవ్యాక్ బ‌యోటెక్ వెల్ల‌డించింది. ఇందుకోసం బ్రెజిల్‌లోని ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, క‌రోనాకు టీకాను క‌నుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా రెండు డజన్లకుపైగా పరిశోధనా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Related Posts