ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ బాబుపై వైసీపీ శ్రేణుల దాడి
పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తయాలులకు గాయాలు
విశాఖపట్టణం జూన్ 15
తూర్పు నియోజకవర్గం రామకృష్ణాపురంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ బాబును వైసీపీ శ్రేణులు అడ్డుకుని దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తయాలులకు గా అయ్యాయి. రామకృష్ణపురంలో పలు అభివృద్ధిపనుల శంకుస్థాపనకు వెళ్లిన సమయంలో వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే వెలగపూడిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే వెళ్లిన సమయంలో అధికార పార్టీకి చెందినవారు ఎమ్మెల్యేపై చెప్పులు, కొప్పరి చిప్పలు, రాళ్లు రువ్వారు. అవి టీడీపీ నేతలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు.దాడికి దిగిన వైసీపీ నేతలు తమ ప్రాంతానికి చెందినవారు కాదని రామకృష్ణాపురం వాసులు అన్నారు. వైసీపీ నేతలు అభివృద్ధి నిరోధకులని ఎమ్మెల్యే రామకృష్ణబాబు ఆరోపించారు. రైడీలను తీసుకువచ్చి రాళ్లతో దాడి చేయించారని మండిపడ్డారు. తమ అధ్యక్షుడు చంద్రబాబు తమకు అభివృద్ధి చేయడమే నిర్పించారని, రౌడీయీజం నేర్పించలేదని అన్నారు. రామకృష్ణాపురం గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేను అడ్డుకోవడంపై స్థానిక టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.