YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 సాయిబాబా, వరవరరావు లను తక్షణం విడుదల చేయాలని నిరసన

 సాయిబాబా, వరవరరావు లను తక్షణం విడుదల చేయాలని నిరసన

 సాయిబాబా, వరవరరావు లను తక్షణం విడుదల చేయాలని నిరసన
ఎమ్మిగనూరు  జూన్ 15
 90% అంగవైకల్యంతో చక్రాల కుర్చీకే పరిమితమైన ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సాయిబాబా, పౌరహక్కుల నాయకుడు కవి వరవరరావు లను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో  స్థానిక సోమప్ప సర్కిల్ నందు భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలపడం జరిగిందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పంపన్న గౌడ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రంగన్న, సిపిఐ మండల కార్యదర్శి ఎం.సత్యన్న, తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై 2014 మే 9న సాయిబాబు అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం నానాటికీ చేయిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను మెడికల్ బెయిల్ పై విడుదల చేయాలని వారు కోరారు. పర్యావరణాన్ని అట్టడుగు వర్గాల పునరావాసాన్ని ఘనంగా పెట్టి జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ శక్తులు సాగిస్తున్న సహజ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా సాయిబాబా పోరాటం చేశారని దానికి ప్రతీకారంగానే ఆయనను అరెస్ట్ చేశారని వారు తెలిపారు. ఆయనను జైలు అధికారులు తన కుటుంబ సభ్యులకు కనీసం మాతృభాష తెలుగులో కూడా లేక రాయడం లేదన్నారు. పౌరహక్కుల నాయకుడు వరవరరావును కూడా వెంటనే విడుదల చేయాలని, గతంలో ఆయన పై 25 తప్పుడు కేసులను బనాయించారని ఆ కేసులన్నీ కొట్టివేయడం జరిగిందినీ వారు తెలిపారు. 2018లో మళ్లీ ఆయనను అరెస్ట్ చేశారని అప్పట్నుంచి జైలు జీవితం గడుపుతున్నారని వారు తెలిపారు. వీరు నే  కాకుండా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకులను అణిచివేయడం లోనే భాగంగా మొన్నటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం గారు కూడా రెండు నెలలపాటు జైల్లో పెట్టి ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను పాతర వేస్తున్నారని ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలో వేలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి ఇతర దేశాలకు పారిపోయిన దోపిడి దొంగలు పట్టుకుని అరెస్టు చేసి జైల్లో పెట్టకుండా రాష్ట్ర మర్యాదలతో దోపిడీదారుల అప్పులను రద్దుచేసి, వారి కేసును కొట్టివేయడం జరుగుతుంది, కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తూ ప్రజాస్వామ్య విలువలను గొంతెత్తి రక్షించండి అంటే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు అంటే ఎంత దుర్మార్గం అని చెప్పి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచే ప్రజాస్వామ్య వాదులను రక్షించి, జైల్లో మగ్గుతున్న ఉద్యమకారులను తక్షణమే విడుదల చేయాలని లేనిపక్షంలో ప్రజాస్వామ్య తంతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.

Related Posts