పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ఆటో లాగుతూ నిరసన
నంద్యాల జూన్ 15
దేశవ్యాప్తంగా కరోనా నివారణ చర్యలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మార్చి 22 నుంచి లాక్ డౌన్ విధించడం జరిగింది. ఇప్పటివరకూ ఎలాంటి పనులు లేక కుటుంబాలు గడవడమే కష్టంగా ఉంటే పది రోజుల నుండి కేంద్ర ప్రభుత్వం రోజువారీగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ టెక్కె మార్కెట్ యార్డ్ ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం నాడు ఆటో లాగుతూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు లక్ష్మణ్ శ్రీనివాస సెంటర్ ఆటో యూనియన్ నాయకులు బద్రి, ప్రసాద్, శ్యామ్ ,మధు,వలి. తదితరులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంబిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయకుండా ప్రజల పై భారం వేయడమే సరైంది కాదని ఏ దేశంలో లేని మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయని వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 20 లక్షల కోట్లు ప్రభుత్వం ప్రకటించి ఏ ఒక్కరికి కూడా పది పైసల్ సహాయం చేయలేదని ఏమయ్యాయో ఎవరికి సహాయం చేశారో అని ప్రజలంతా అర్థం కాని స్థితిలో ఉన్నారని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రజలందరికీ సహాయం చేయాలని అన్నారు.