నియోజకవర్గంలో శాంతి భద్రతలను పరిరక్షించాలి
పత్తికొండ జూన్ 15
పత్తికొండ నియోజకవర్గంలో అదుపు తప్పుతున్న శాంతి భద్రతలను పరిరక్షించాలని టిడిపి నాయకులు తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కె.యి.శ్యామ్ బాబు ఆదేశాలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ అరెస్టులు,దళితుల,బడుగు బలహీన వర్గాల పై దాడులు చేయడం,తెలుగుదేశం పార్టీ నాయకులను,కార్యకర్తలను వేధించడం, నియోజకవర్గంలో అక్రమ ఇసుక,నకిలీ మద్యం అమ్మకాలు,పాత్రికేయుల పై దాడులు,వైకాపా నాయకుల బెదిరింపులు పాల్పడటం ఇలాంటి చర్యలు చేపడుతున్న వారి పై అధికారులు విచారించి,చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని తాహసిల్దార్ శ్రీదేవి కు టిడిపి నాయకులు మెమోరాండం ను అందజేశారు.ఈ కార్యక్రమంలో సాంబశివారెడ్డి,బత్తిన వెంకట రాముడు మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.