YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనా కంటే కరెంట్ భయం ఎక్కువ

కరోనా కంటే కరెంట్ భయం ఎక్కువ

కరోనా కంటే కరెంట్ భయం ఎక్కువ
భువనగిరి జూన్ 15 
కరోనా కాలంలో వైరస్ కంటే  కరెంట్ బిల్లులకే ప్రజలు భయపడిపోతున్నారు. కరెంట్ బిల్లుకు షాక్ కొడుతున్నట్లుగా ఉంది ప్రజలు వాపోతున్నారు. కరెంట్ బిల్లులు వచ్చిన తీరు చూస్తే. లాక్ డౌన్ కారణంగా అష్టకష్టాలు పడుతున్న సమయంలో విద్యుత్‌ బిల్లులు మోత సామాన్యులు శాపంగా మారింది అని ఆరోపించారు మాజీ మంత్రి బిజెపి నాయకులు పెద్దిరెడ్డి. ప్రస్తుతం మీటరు రీడింగ్‌ ప్రకారం బిల్లులు ఇవ్వడంతో రెట్టింపు చార్జీలు వచ్చాయి. డబుల్ కాదు త్రిబుల్ కూడా కాదు అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి ప్రభుత్వం తీరు నిదర్శనమని మాజీ మంత్రి బిజెపి నాయకుడు పెద్దిరెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కరెంటు కార్యాలయం ఎదుట రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపుమేరకు జిల్లా బిజెపి నాయకులు  ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు ఈ ధర్నా మాజీ మంత్రి పెద్దిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలకు విద్యుత్ చార్జీల మోత రెండు నెలల రీడింగ్‌ ఒకేసారి తీయడంతో ఏ,బి,సి  స్లాబ్‌ మారి చార్జీలు భారీగా  పెరిగాయి. దీంతో వినియోగదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అని పెద్దిరెడ్డి విమర్శించారు.

Related Posts